మాజీ ప్రియుడి ఇంట్లో స్టార్ హీరో కుమార్తె సెలెబ్రేషన్స్, మృణాల్ ఠాకూర్ కూడా వెళ్ళిందిగా.. వైరల్ వీడియోస్
కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ సెలెబ్రేషన్స్ కి పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. కార్తీక్ ఆర్యన్ యువ హీరోగా బాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.

భక్తి శ్రద్దలతో నిర్వహించే పండుగలు కూడా ఇప్పుడు పార్టీ కల్చర్ గా మారిపోతున్నాయి. బాలీవుడ్ ఈ తరహా కొత్త సాంప్రదాయం మొదలైంది. గణేష్ ఉత్సవాల పేరుతో బి టౌన్ లో పార్టీలు హోరెత్తుతున్నాయి. శిల్పా శెట్టి ఇంట్లో జరిగిన గణేష్ ఉత్సవాల పార్టీకి సెలెబ్రిటీలంతా హాజరయ్యారు.
ఆ తర్వాత ముఖేష్ అంబానీ నివాసంలో గణేష్ చతుర్థి పార్టీ ఒక రేంజ్ లో జరిగింది. బాలీవుడ్ మొత్తం ముకేశ్ అంబానీ ఇంటికి తరలి వెళ్లడం చూశాం. ఇప్పుడు మరో క్రేజీ సెలెబ్రిటీ నివాసంలో గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఆ క్రేజీ సెలెబ్రిటీ ఎవరో కాదు స్టార్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.
కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ సెలెబ్రేషన్స్ కి పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. కార్తీక్ ఆర్యన్ యువ హీరోగా బాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే కార్తీక్ ఆర్యన్ చివరగా నటించిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రీమేక్ షెహజాద దారుణంగా నిరాశపరిచింది.
ఇక గణేష్ సెలెబ్రేషన్స్ విషయానికి వస్తే.. కార్తీక్ ఆర్యన్ నివాసానికి అతడి మాజీ ప్రియురాలు స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ హాజరు కావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో కార్తీక్ ఆర్యన్, సారా ఇద్దరూ డీప్ లో లవ్ లో మునిగితేలారనే రూమర్స్ ఉన్నాయి. కొంతకాలం డేటింగ్ తర్వాత ఇద్దరూ విడిపోయారు.
ప్రేమికులుగా విడిపోయినప్పటికీ స్నేహం కొనసాగుతోంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. సారా అలీఖాన్ మాత్రమే కాదు సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా కార్తీక్ ఆర్యన్ ఇంటికి వెళ్ళింది. ఆలాగే రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీ, నటుడు కబీర్ ఖాన్ దంపతులు, రవీనా టాండన్ కుమార్తె రాషా కార్తీక్ ఆర్యన్ ఇంట్లో గణేష్ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.