సారా అలీ ఖాన్.. బాలీవుడ్ పటౌడీ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మాయ్ సినీ కెరీర్ ను మంచి విజయంతో మొదలెట్టింది. తండ్రి సైఫ్ అలీ ఖాన్ వారసత్వాన్ని నిలబెడుతూ సారా  హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. టెంపర్ బాలీవుడ్ రీమేక్ సింబా సినిమా ద్వారా సారాకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. 

ఆ సినిమాలో బేబీ నటనకు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా పాలిటిక్స్ గురించి స్పందించింది. కెరీర్ చివరిదశలోకి వస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని రాజకీయాలు నాకు చాలా ఇంట్రెస్ట్ అని అమ్మడు చాలా క్లియర్ గా చెప్పేసింది. 

23 ఏళ్ల సారా మంచి నటిగానే కాకుండా విద్యా బుద్దులు కూడా గట్టిగానే నేర్చుకుంది. కొలంబియా యూనివర్సిటీ నుంచి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న సారా పాలిటిక్స్ ని బాగా ఫాలో అవుతుందట. మరి అమ్మడు రాజకీయాల్లోకి ఎలాంటి అడుగులు వేస్తుందో తెలియాలంటే మినిమమ్ ఓ 20 ఏళ్ళు ఆగాల్సిదే.