నిర్మాతలను హర్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 19, Sep 2018, 1:58 PM IST
Santhosh Sivan's tweet lands him in trouble with producers
Highlights

ఇండస్ట్రీలో స్టార్ కెమెరామెన్ గా దూసుకుపోతున్నారు సంతోష్ శివన్. ఆయన సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 

ఇండస్ట్రీలో స్టార్ కెమెరామెన్ గా దూసుకుపోతున్నారు సంతోష్ శివన్. ఆయన సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అయితే తాజాగా సరదా కోసం ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్ లో పలు వివాదాలకు దారి తీస్తోంది.

నిర్మాతలను కించ పరిచే విధంగా ఉన్న ఆ ట్వీట్ తో పలువురు మనోభావాలు దెబ్బతిన్నాయి. కోపంగా, నవ్వుతున్న కుక్క ఫోటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్ ఇచ్చాడు. సినిమాను పని చేసే సాంకేతిక నిపుణులకు డబ్బులు ఇచ్చేప్పుడు నిర్మాతలు మొహం చిరాకుగా,  హీరోయిన్ కి ఇచ్చేప్పుడు మాత్రం నవ్వుతూ ఇస్తారంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తో హర్ట్ అయిన కొందరు నిర్మాతలు తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఈరోజు(బుధవారం) నిర్మాతల మండలి సమావేశమై దీని గురించి చర్చించనుంది. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన సంతోష్ శివన్ ఈ ట్వీట్ ని తన అకౌంట్ నుండి తొలగించారు. అయితే అప్పటికే ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఏం చేయలేక గమ్మునుండిపోయారు. 

loader