సంక్రాంతి రిలీజ్ లు...OTT రిలీజ్ డేట్స్, ఈ నెల్లోనే మొత్తం
కొత్త సంవత్సరం(2023) తొలి నెల సంక్రాంతి సినిమాల సందడితో కంప్లీట్ అయ్యింది. ఈ పిబ్రవరి నెలలో అవన్నీ ఓటిటిలోకి దూకుతున్నాయి.

సంక్రాంతి (Sankranthi 2023) నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు లైన్‌లో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా సాగింది. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఒక్క రోజు తేడాతో సంక్రాంతి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్లుగానే సినిమాలు రెండూ భాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య మళ్లీ థియేటర్ రెవిన్యూలకు ప్రాణం పోసింది. మరోవైపు అజిత్, విజయ్ కూడా ఇదే సంక్రాంతికి బరిలో దూకారు. వాటికి డివైడ్ టాక్ వచ్చింది. అయినా భాక్సాఫీస్ దగ్గర నష్టం అయితే రాలేదంటున్నారు. ఇక సంక్రాంతి వెళ్లిపోవటంతో ఆ సినిమాలను థియేటర్ లో చూడని వాళ్లు ..ఓటిటి రిలీజ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ వరసగా..
వీరసింహారెడ్డి..
వీరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న గ్రాండ్‌గా విడుదల అయ్యింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించగా.. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో పిభ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వాల్తేరు వీరయ్య.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసణ్ హీరోయిన్‌గా మెరిసింది. జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో పిభ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వారిసు..(వారసుడు)
వంశీపైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం వారిసు. తెలుగులో వారసుడు టైటిల్‌తో రిలీజ్ అయ్యింది. వారిసు (తమిళ్) జనవరి 11న విడుదల అవ్వగా.. వారసుడు (తెలుగు) జనవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ లో పిభ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తునివు (తెగింపు):
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం తునివు. హెచ్ వినోథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో తెగింపు టైటిల్‌తో వచ్చింది. మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించిన తునివు జనవరి 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం నెట్ ప్లిక్స్, అమేజాన్ ప్రైమ్ రెండింటిలో పిభ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ నెలలో రిలీజ్ అయిన సుధీర్ బాబు తాజా చిత్రం హంట్..అమేజాన్ ప్రైమ్ లో పిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మోహన్ లాల్ ఎలోన్ సైతం హాట్ స్టార్ లో ఈ నెలాఖరకు స్ట్రీమింగ్ కానుంది. అలాగే...
సోనీలివ్
జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) - ఫిబ్రవరి 3
ఆహా
అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీ కే (టాక్ షో పవన్ కల్యాణ్ ఎపిసోడ్-1) - ఫిబ్రవరి 3
డిస్నీ+హాట్‌స్టార్
1. బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 1
2. సెంబి (తమిళం) - ఫిబ్రవరి 3
నెట్‌ఫ్లిక్స్
1. పమీలా (హాలీవుడ్) - జనవరి 31
2. గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 1
3. క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) - ఫిబ్రవరి 3
4. ట్రూ స్పిరిట్ - ఫిబ్రవరి 3
5. ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) - ఫిబ్రవరి 3
6. స్ట్రామ్ బాయిల్ - ఫిబ్రవరి 3
7. వైకింగ్ ఊల్ఫ్ - ఫిబ్రవరి 3