బ్లాక్ బస్టర్ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి హనుమాన్ మూవీ ఎప్పుడు? ఎక్కడ? చూడొచ్చో తెలుసుకుందాం... 
 

sankranthi block buster hanuman ott details ksr

హనుమాన్ 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి ఇమేజ్ లేని ఒక యంగ్ హీరో ఈ ఫీట్ సాధించడం ఊహించని పరిణామం. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద హనుమాన్ అద్భుతం చేసింది. హనుమాన్ కి పోటీగా విడుదలైన బడా హీరోలు హనుమాన్ ముందు నిలవలేకపోయారు. 

సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ ఓటీటీలోకి వచ్చేశాయి. హనుమాన్ మాత్రం ఇంకా రాలేదు. కారణం... హనుమాన్ థియేట్రికల్ రన్ ముగియలేదు. ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లు రాబడుతుంది. ఇటీవల నైజాం లో టికెట్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హనుమాన్ త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానుందట. 

మార్చి 2 నుండి హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. హనుమాన్ డిజిటల్ రైట్స్ జీ 5 సొంతం చేసుకున్న నేపథ్యంలో సదరు ప్లాట్ ఫార్మ్ నందు అందుబాటులోకి రానుందట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉండగా... సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. 

హనుమాన్ లో తేజ సజ్జాకి జంటగా అమృత అయ్యర్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. ఇక హనుమాన్ కి సీక్వెల్ ఉందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా ఓ స్టార్ చేస్తారని ప్రశాంత్ వర్మ అన్నారు. 2025లో హనుమాన్ థియేటర్స్ లోకి రానుందట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios