ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే మన టాలీవుడ్‌లో విడుదలైన మహానటి సావిత్రి బయోపిక్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దర్శక నిర్మాతలకు మంచి కలెక్షలను తెచ్చిపెట్టింది. కాగా.. తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన సంజయ్‌దత్ బయోపిక్ సంజు కూడా ఇదే బాటలో బాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ కలెక్షన్ల బాటలో సాగుతోంది.

ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'సంజు' చిత్రంపై విడుదలకు మందు నుంచే మంచి హైప్ ఉండటంతో, ఈ సినిమాను తొలిరోజే భారీ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన తొలి రోజే మన దేశంలో 34 కోట్లు 75 లక్షల రూపాయల నెట్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి ఇంకా ఓవర్‌సీజ్ కలెక్షన్లను కలపలేదు, అవి కూడా కలిపితే ఈ చిత్రం ఇప్పటి వరకూ బాలీవుడ్ బాక్సీఫీస్‌లో వచ్చిన అన్ని స్టార్ హీరోల చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్లను తెచ్చిపెట్టింది

ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా చూసుకుంటే, ఈ ఏడాది సంజు చిత్రానిదే అగ్రస్థానం. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో సంజు మొదటి స్థానంలో ఉండగా, రేస్-3, బాగి-2, పద్మావత్ చిత్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3కి తొలి రోజు 29 కోట్ల రూపాయల కలెక్షన్ రాగా, బాగి-2కు 25 కోట్లు, పద్మావత్ కు 20 కోట్లు వచ్చాయి. సంజు పాత్రలో నటించిన రణబీర్ కపూర్ నటనకు యావత్ బాలీవుడ్ సినీ ప్రపంచం గులాం అంటోంది, ఆయన నటనకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.