Asianet News TeluguAsianet News Telugu

తెలుగు మూవీలో సంజనా గల్రానీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న `మణిశంకర్‌` మోషన్‌ పోస్టర్..

సంజనా గల్రానీ నటిస్తున్న `మణిశంకర్‌` చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ మోహన్‌ పోస్టర్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న శివ కంఠమనేని ఉన్న పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

sanjjanaa galrani back to tollywood with manishankar movie
Author
Hyderabad, First Published Nov 1, 2021, 8:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

`బుజ్జిగాడు` ఫేమ్ సంజనా గల్రానీ(Sanjjanaa Galrani) చాలా గ్యాప్‌తో తెలుగులో సందడి చేయబోతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులోకి కమ్‌ బ్యాక్‌ అవుతూ ఓ సినిమా చేస్తుంది. `మణిశంకర్‌`(Mani Shankar) అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శివ కంఠమనేని హీరోగా నటిస్తుండగా, ప్రియా హెగ్డే, చాణక్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్‌ ఎలిమెంట్స్  మేళవించిన డిఫరెంట్‌ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్ ని సోమవారం విడుదల చేశారు. 

`మణిశంకర్‌` చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ మోహన్‌ పోస్టర్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న శివ కంఠమనేని ఉన్న పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదిరిపోయేలా ఉంది. మోషన్‌ పోస్టర్‌కి సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది.  ఈ సంద‌ర్భంగా హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ, `ఈ రోజు(సోమవారం) విడుద‌లైన మా `మ‌ణిశంక‌ర్` టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. 

సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది. త్వరలో ఆడియెనస్ ముందుకు తీసుకొస్తాం` అని తెలిపారు. 
ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ, `మ‌ణిశంక‌ర్` అనేది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది` అని వెల్లడించారు. 

యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె).  లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తారాగ‌ణం: శివ కంఠ‌మ‌నేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణిక్య‌, మాణిక్య రెడ్డి, సుబ్బ‌రాజ్ శ‌ర్మ‌, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు. 

also read: తనని పడేద్దామనుకుంటున్నాడంటూ టీమ్‌ లీడర్‌పై రోజాకి `జబర్దస్త్` వర్ష కంప్లైంట్‌.. కుప్పిగంతులపై రోజా సెటైర్లు

ఇదిలా ఉంటే ఇటీవల కన్నడనాట డ్రగ్స్ కేసులో హీరోయిన్‌ సంజనా గల్రానీ అరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలలు ఆమె జైల్లో మగ్గారు. బెయిల్‌ కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, మూడు నెలల అనంతరం బెయిల్‌ దక్కించుకుని విడుదలయ్యారు. మరోవైపు సంజనా గల్రానీ తెలుగు చిత్రం `సోగ్గాడు`తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, కన్నడ చిత్రాలు చేస్తూ వస్తోంది. తెలుగులో ఆమె ప్రభాస్‌తో `బుజ్జిగాడు` చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా 2017లో సునీల్‌ సరసన `టూ కంట్రీస్‌` చిత్రంలో మెరిసింది. 

also read; Raja Vikramarka trailer: దీపావళికి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడట..

Follow Us:
Download App:
  • android
  • ios