Alia Bhatt Next Movie:ఆలియా భట్ తో సంజయ్ లీలా బన్సాలి మరో సినిమా...

సంజయ్ లీలాబన్సాలీతో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు.. ఆయన కథలు.. టేకింగ్.. స్క్రీన్ ప్లే బాలీవుడ్ కే ట్రెండ్ మార్క్ ఆయన. 
 

Sanjay Leela Bhansali Next Movie With Alia Bhatt

రీసెంట్ గా సంజయ్ లీలా బన్సాలీ ద‌ర్శక‌త్వంలో గంగూబాయ్ కతియావాడి సినిమా తెరకెక్కింది. ముంబయ్ మాఫీయా డాన్.. కామాతిపుర ను ఏలిన  గంగుబాయి అనే వేశ్య జీవితం ఆధారంగా తెరకెక్కింది సినిమా. అలియాభ‌ట్ లీడ్ రోల్‌లో న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వరి 25న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 

రీసెంట్ గా గంగూబాయి క‌తియావాడి సినిమాతో అలియా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ సినిమాలో ఆలయా నటనకు వంద మార్కులు పడ్డాయి.ఆమె న‌ట‌న‌కు ప్రేక్ష‌కులే కాకుండా సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లు దక్కాయి. గంగూబాయ్ గా ఇంత చిన్న వయస్సులో ఆలియా అద్బుతంగా చేసిందని బాలీవుడ్ అంతా ప్రశంసించింది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.

రీసెంట్ గా  అలియాభ‌ట్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో  భాగంగా భ‌న్సాలీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అంతే కాదు ఆలియా భట్ తో కూడా ఫన్నీ గా మాట్లాడారు. ఇప్పుడున్న యాక్ట్రస్ లో  అలియాభ‌ట్ త‌నకు  ఫేవ‌రెట్ అంటున్నాడు సంజయ్. ఆలియా లాంటి నటిని తను చూడలేదన్నారు. ఈ ఏజ్ లో వెయిట్ ఉన్న క్యారెక్టర్ ను చేయడం సాధయం కాదు అంటున్నాడు. 

అంతే కాదు... సంజయ్ ఈ విషయం చెప్పగానే అలియా మాట్లాడుతూ.. త‌న‌తో మ‌ళ్లీ సినిమా చేస్తారా అని సరదాగా అడిగింది. దానికి సమాధానం చెపుతూ సంజయ్ లీలా... నేనెప్పుడూ రెడీనే అన్నారు.  దాంతో వీరిద్దరి సినిమాపై మరోసారి ఫ్యాన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది కాని.. వచ్చే ఏడాది కాని వీరి కాంబోలో మరో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. 

ఇక ఆలియా భట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆలియా భట్ నటించిన పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ ఈనెల 25న రిలీజ్ కు రెడీ అయ్యింది. దీనితో పాటు  ఆలియా భ‌ట్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోసం హ‌ర్ట్ ఆఫ్ స్టోన్‌ వెబ్ మూవీ చేస్తోంది. ఈ మూవీతో ఆలియా భట్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios