ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం స్టోరీ లైన్ .. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలు ఏమిటనేది రివీల్ చేసేసారు రాజమౌళి. అయినా ఈ సినిమాలో లేటెస్ట్ అప్ డేట్స్ పై జనాలకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి అప్ డేట్ లాంటి వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

అదేమిటంటే ఈ సినిమాలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు నటించే అవకాసం ఉందిట. ఈ మేరకు సంజయ్ దత్ ని, వరుణ్ ధావన్ లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వీళ్లు కనుక ఓకే చేస్తే కనుక బాలీవుడ్ లోనూ ఈ సినిమా మార్కెట్ భారీ ఎత్తున జరిగేందుకు ఆ హీరోలు ఖచ్చితంగా ఉపయోగపడతారనంటలో సందేహం లేదు. 

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటన వచ్చేసింది. ఆయన పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు.  ఇప్పటి వరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.