బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ ప్రియుడు మరణించాడు. ఈ విషయాన్ని త్రిషాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. 

''నా గుండె పగిలింది.. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు.. నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతజ్ఞతలు.. నా జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచంలోనే అద్రుష్టవంతురాలైన అమ్మాయిగా భావిస్తున్నాను. నీదాన్ని అయినందుకు మురిసిపోయాను.. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావ్.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మళ్లీ నిన్ను కలుసుకునేంతవరకు నిన్ను ఎంతగా మిస్ అవుతానో నాకు మాత్రమే తెలుసు..'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

తన పోస్ట్ లో తన ప్రియుడి పుట్టినరోజు, మరణించిన రోజుని ప్రస్తావించిన త్రిషాల అతడి గురించి ఇతర విషయాలను వెల్లడించలేదు. పోస్ట్ ని బట్టి అతడు మంగళవారం నాడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. జీవితాన్ని ధైర్యంగా ఫేస్ చేయాల్సి ఉంటుందనిఆమెకి అండగా నిలుస్తున్నారు. త్రిషాల.. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురనే విషయం తెలిసిందే!