సంజయ్ దత్ పారితోషికం లీక్.. `డబుల్ ఇస్మార్ట్`కి అందేది ఎంతంటే?
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో `డబుల్ ఇస్మార్ట్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఆయన పారితోషికం లీక్ అయ్యింది.

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్(Sanjay Dutt).. నెగటివ్ రోల్స్ చేస్తూ సౌత్‌ని రూల్ చేస్తున్నాడు. `కేజీఎఫ్2`లో తన విశ్వరూపం చూపించాడు. దీంతో ఆయనకు సౌత్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆయన తెలుగులో రామ్ (Ram Pothineni) సినిమాలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న `డబుల్ ఇస్మార్ట్` (Double Ismart) మూవీలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బిగ్ బుల్ అయే నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీకి ఆయన అందుకుంటున్న పారితోషికం లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో అది చక్కర్లు కొడుతుంది.
ఈ లెక్క ప్రకారం సంజయ్ దత్.. `డబుల్ ఇస్మార్ట్` చిత్రానికిగానూ ఏకంగా ఆరు కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట. సినిమాలో ఆయన పాత్ర బలంగా ఉంటుందని, చాలా కీలకంగా ఉంటున్న నేపథ్యంలో పారితోషికం బాగానే అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన రేంజ్‌కి అది తక్కువే అయినా, ఒక విలన్ పాత్రకి ఆ రేంజ్ పారితోషికం ఇవ్వడం ఎక్కువే అని చెప్పొచ్చు.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తన సొంత ప్రొడక్షన్‌లోనే ఈ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. పూరీ చివరగా `లైగర్` మూవీని తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో `డబుల్ ఇస్మార్ట్`ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్` చిత్రానికి మించి ఉండేలా, డబుల్ డోస్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 8న పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రామ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని సమాచారం.
ఇక సంజయ్ దత్.. `కేజీఎఫ్`లో అధీరగా నటించి మెప్పించారు. విలన్‌గా అదరగొట్టారు. దీంతో ఆయనకు సౌత్‌లో నెగటివ్ రోల్స్ వస్తున్నాయి. ఇటీవల విజయ్ `లియో`లోనూ నటించారు. ఆంటోనీ దాస్ పాత్రలో క్రూరమైన విలన్‌గా వాహ్ అనిపించారు. ఇప్పుడు `డబుల్ ఇస్మార్ట్`తో మరో స్ట్రాంగ్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. మరోవైపు హిందీలోనూ కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు సంజయ్ దత్.