నటించకుండానే రూ.10 కోట్లు వచ్చాయ్..

sanjay dutt charged a bomb for sanju movie
Highlights

 సినిమా కోసం సంజయ్ కు ఏమైనా రెమ్యునరేషన్ ఇచ్చారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన కథను సినిమాగా చేయడానికి సంజయ్ రూ.10 కోట్ల రూపాయలు చార్జ్ 
చేసినట్లు తెలుస్తోంది

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ 'సంజు' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. రన్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస వద్దా రూ.200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్ దత్ జీవితంలో గల ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో టచ్ చేశారు.

అయితే ఈ సినిమా కోసం సంజయ్ కు ఏమైనా రెమ్యునరేషన్ ఇచ్చారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన కథను సినిమాగా చేయడానికి సంజయ్ రూ.10 కోట్ల రూపాయలు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో కొంత వాటా కూడా సంజయ్ కు వెళ్తుందని సమాచారం. నటించకుండానే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం సంజయ్ దత్ కు బాగానే కలిసొచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

loader