చేతిలో పెద్ద కత్తి పట్టుకొని, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న సంజయ్ లుక్ భయంకరంగా ఉంది. కెజిఎఫ్ 2 లో ప్రధాన విలన్ అధీరా రోల్ సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు నేడు. 62ఏళ్ళు పూర్తి చేసుకున్న సంజయ్ దత్ కి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక కెజిఎఫ్ టీం నుండి ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ అందాయి. కెజిఎఫ్ 2 టీమ్ అధీరాగా ఆయన సెకండ్ లుక్ విడుదల చేశారు. 


చేతిలో పెద్ద కత్తి పట్టుకొని, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న సంజయ్ లుక్ భయంకరంగా ఉంది. కెజిఎఫ్ 2 లో ప్రధాన విలన్ అధీరా రోల్ సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ ఎంట్రీతో కెజిఎఫ్ 2 హైప్ మరింత పెరిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి పార్ట్ కి మించి కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ ఎత్తున విడుదల కానుంది. 


కన్నడ స్టార్ యష్ హీరోగా 2018లో విడుదలైన కెజిఎఫ్ సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 తెరకెక్కుతుంది. ప్రకాష్ రాజ్, అనంత్ నాగ్, రావు రమేష్ వంటి విలక్షణ నటులు కెజిఎఫ్ 2లో కీలక రోల్స్ చేస్తున్నారు.

Scroll to load tweet…