బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 కి రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మొదట జనాలు పెద్దగా ఆసక్తి కనపరచకపోయినప్పటికీ.. రాను రాను షో ఇంట్రస్టింగ్ మారుతోంది. మొదటి వారం ముగిసేసరికి కామనర్ గా హౌజ్ లోకి అడుగుపెట్టిన  సంజన ఎలిమినేట్ అయ్యింది. ఆమె స్థానంలోకి మరో మోడల్, యాక్టర్ నందినీ రాయ్ హౌజ్ లోకి అడుగుపెట్టింది.

అయితే.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంజన పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో నాని గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ ఛానల్‌లో మీకు ఎవరి యాంకరింగ్ నచ్చిందని సంజనను యాంకర్ అడగగా.. ‘ఐ ఫోన్ ఉపయోగించినవాళ్లు.. సాధారణ ఫోన్ వాడటానికి ఎలా ఉంటుందో ఎన్టీఆర్ యాంకరింగ్ చూసిన తరువాత నాకు నాని యాంకరింగ్ అలానే ఉంది .ఎన్టీఆర్‌తో ,నానీని అసలు పోల్చలేమని, అది సినిమాల్లో అయినా సరే, మరెక్కడైనా   సరే ’అంటూ నానీని తక్కువ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సంజన.

సంజన చేసిన వ్యాఖ్యలపై నాని అభిమానులు మండిపతున్నారు. మనిషికి జీవితంలో అంత పొగరు, తల బిరుసుతనం అవసరం లేదు. ఎదరుటివారి పట్ల కనీస గౌరవ మర్యాదగా నడుచుకోవాలని ఆమెకు హితబోధ చేస్తున్నారు. నాని కూడా ఒకప్పుడు సాధారణ వ్యక్తేనని, ఇతరుల పట్ల గౌవరం కలిగినవాడు కాబట్టి నేడు నాచురల్ స్టార్  స్టేటస్‌ను అనుభవిస్తున్నాడు.. మంచిగా ప్రవర్తించకపోతే జీవితంలో పైకి రాలేవని సంజనపై సెటైర్లు వేస్తున్నారు.