అర్జున్ రెడ్డి సినిమాతో  తెలుగు పరిశ్రమ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరక్టర్ సందీప్ వంగ . అదే సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అరుదైన సక్సెస్ అందుకున్నాడు. తెలుగులో కన్నా హిందీలోనే ఘన విజయం సాధించిందీ చిత్రం. అర్జున్ రెడ్డి రీమేక్.. కబీర్ సింగ్ ఊహించని విధంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లాబాల్ని అందించటంతో అనేక మంది నిర్మాతలు, హీరోలు అతని వెనకపడ్డారు. కానీ  మళ్ళీ ఆ నిర్మాతలతోనే సందీప్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ముందుకు వెళ్లలేదు. అయితే తాజాగా సందీప్ ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు. ఈ విషయమై ఆయన  అఫీషియల్ గా మీడియాకు రివీల్ చేసారు. 

సందీప్ మాట్లాడుతూ...“నా నెక్ట్స్ ఫిల్మ్ ఓ క్రైమ్ డ్రామా. స్క్రిప్టు ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యింది అఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలో వస్తుంది. టీ సీరిస్ వారు మెయిన్ స్టూడియో గా ఉంటారు. కానీ ఆ సినిమాని నా సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది ,” అన్నారు.

అంతాబాగానే ఉంది కానీ హీరో ఎవరనేది చెప్పలేదు సందీప్. గతంలో ఈ దర్శకుడు రామ్ చరణ్, రణబీర్ కపూర్, మహేష్ బాబు లకు తన కథని నేరేట్ చేసారు. కానీ ఎక్కడా మెటీరియలైజ్ కాలేదు. మరి ఈ స్క్రిప్టుకు హీరో ఎవరూ అంటే...ఇంతకు ముందు అర్జున్ రెడ్డి రీమేక్ లో చేసిన షాహిద్ కపూర్ అని బాలీవుడ్ లో గాసిప్ లు వినపడుతున్నాయి. ఎంతవరకూ నిజం అనేది మాత్రం తెలియదు. అయితే ఖచ్చితంగా స్టార్ హీరో ఈ యువ దర్శకుడు సినిమాలో నటిస్తారనేది మాత్రం చెప్పచ్చు.
 
ఇక ఈ ప్రాజెక్ట్ కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ తో పాటు సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.  ఈ సినిమాపేరు డెవిల్ అని, హీరోది ...నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ అని ప్రచారం జరుగుతోంది.