ప్చ్ ..మహేష్ చేసి ఉంటే అదిరిపోయేదే అంటున్నారు
యాక్షన్ తో ప్యాక్ చేసి, ఇంటెన్స్, హై-ఆక్టేన్ స్టంట్‌లు, పవర్ ఫుల్ డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్, బ్రిలియంట్ స్కోర్, వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించింది.

ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథను మరో హీరోతో చేయటం ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయం. అయితే ఆ విషయం చాలా సార్లు బయిటకు రాదు. అయితే ఇవి సోషల్ మీడియా రోజులు కావటంతో ప్రతీ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. నిజమేనేమో అనిపించేలా గాసిప్ లు వార్తలుగా వస్తున్నాయి. యానిమల్ టీజర్ రిలీజైన దగ్గర నుంచీ అర్రెరే మహేష్ మంచి సినిమాని మిస్ చేసుకున్నాడే అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అలా అనుకోవటానికి కారణం ఉంది. గతంలో మహేష్ బాబుని కలిసి సందీప్ వంగా కథ చెప్పటం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. వరస పెట్టి మహేష్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గ్యాప్ లో ఎప్పుడైనా చేస్తాడేమో కానీ ప్రస్తుతానికి అయితే అఫీషియల్ గా లేదు.
ఇక అప్పుడు మహేష్ బాబుకు చెప్పిన ఆ కథే ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో తీసాడట. అర్జున్ రెడ్డితో బోల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందీప్‌కు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో మహేష్‌బాబుకు చెప్పిన కథతోనే అక్కడ సినిమా తీసేసాడు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇక రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అతని సినిమా 'యానిమల్' నుండి ఒక ప్రత్యేక టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ వైరల్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ‘యానిమల్’ #Animal సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆసక్తితో సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ రెండు నిమిషాల, 26 సెకన్ల వున్నా యాక్షన్ తో ప్యాక్ చేసి, ఇంటెన్స్, హై-ఆక్టేన్ స్టంట్‌లు, పవర్ ఫుల్ డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్, బ్రిలియంట్ స్కోర్, వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించింది. యానిమల్ టీజర్ ఇన్స్టంట్ హిట్ కావడంతో ఇలాంటి సినిమాని మహేష్ వదిలేసుకున్నాడా అని టాక్ మొదలైంది.
ఇది ‘యానిమల్’ తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించిన అనిల్ కపూర్ (AnilKapoor), రణబీర్ కపూర్ ల మధ్య జరిగిన ఓ కథగా చెప్పొచ్చు. వారిమధ్య చాలా సంక్లిష్టమైన సంబంధం వున్నట్లు అనిపిస్తుంది. తండ్రి తనపై చేయి చేసుకున్నప్పటికీ హీరో తన తండ్రిని 'ప్రపంచంలోని ఉత్తమ తండ్రి' అని నమ్ముతాడు. ఆ తరువాత హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వెరీ వైలెంట్ గా మారతాడు. బాబీ డియోల్ (BobbyDeol) చివరిలో విలన్ గా పరిచయమయ్యారు, కానీ అది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రణబీర్ రెబల్ గా మారడం అలాగే అతన్ని చాలా రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలలో చూపించటం ఇవనీ చూస్తుంటే, ఈ సినిమా కోసం రణబీర్ బాగా కష్టపడ్డాడు అనే తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అతని పాత్రను ప్రెజెంట్ చేయడంలో తన మార్క్ చూపించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.