రణ్‌బీర్ కపూర్‌తో చేసిన `యానిమల్` పెద్ద హిట్ కావడంతో ఇమ్మీడియెట్‌గా రెండో పార్ట్ `యానిమల్ పార్క్` ఉంటుందని అనుకున్నారు. దీనిపై సందీప్ రెడ్డి వంగా బ్రదర్ ప్రణయ్ వంగా క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే వార్త వచ్చింది. ఓ వైపు `సలార్`తో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్నాడు డార్లింగ్. ఈ మూవీ నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లు దాటింది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. సంక్రాంతి వరకు ఈ మూవీకి తిరుగే లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐదేళ్లుగా ఉన్న ఆకలిని `సలార్` తీర్చడంతో వారంతా సంబరపడుతున్నారు. ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీనికితోడు `సలార్`కి పార్ట్ 2 కూడా ఉంది. దీనికి టైటిల్ `సలార్‌ః శౌర్యంగ పర్వం` ప్రకటించారు. రెండో పార్ట్ లోనే అసలు కథ ఉంటుందని, మొదటిదాన్ని మించి ఉంటుందన్నారు.
దీంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో గూస్ బంమ్స్ తెప్పించే వార్త చెప్పారు సందీప్ రెడ్డి వంగా బ్రదర్. ఆయన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌తో సందీప్ `స్పిరిట్` అనే చిత్రాన్ని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇటీవల రణ్‌బీర్ కపూర్‌తో చేసిన `యానిమల్` పెద్ద హిట్ కావడంతో ఇమ్మీడియెట్‌గా రెండో పార్ట్ `యానిమల్ పార్క్` ఉంటుందని అనుకున్నారు. ఆ వార్తలే వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై సందీప్ రెడ్డి వంగా బ్రదర్ ప్రణయ్ వంగా క్లారిటీ ఇచ్చాడు.
సందీప్ నెక్ట్స్ చేసేది ప్రభాస్ మూవీనే అని తేల్చి చెప్పాడు. ఇమ్మీడియెట్‌గా `స్పిరిట్` ప్రారంభమవుతుందన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రారంభం కాబోతుందట. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందన్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్ కనిపిస్తారు. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత యారొగెంట్‌గా ఉంటుందో తెలిసిందే. అదే పోలీస్ పాత్రకి ఇలాంటి యాటిట్యూడ్, యారొగెంట్ తోడైతే ఇక రచ్చ రచ్చే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్‌తో అదే చేయబోతున్నారట సందీప్.
`స్పిరిట్` తర్వాతనే `యానిమల్ పార్క్` ఉంటుందన్నారు. ఇప్పటికే సినిమాలోని పాత్రలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నవి అని, దీంతో లేట్ కాదని, వెంటనే ఆ మూవీ కూడా చేస్తామని తెలిపారు. ఈ లెక్కన ఈ రెండు సినిమాల తర్వాతనే అల్లు అర్జున్‌తో మూవీ ఉండే అవకాశం ఉంది. సో బన్నీ కొన్నాళ్లపాటు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లా `సలార్ 2` పరిస్థితేంటి? అనేది ప్రశ్నగా ఉంది. ఇమ్మిడియెట్‌గా ఈ పార్ట్ 2 ఉంటుందా? గ్యాప్ తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. `స్పిరిట్` ప్రారంభమైతే `సలార్2`కి డేట్స్ ఇవ్వడం కష్టమవుతుంది. మరి ఎలా మ్యానేజ్ చేస్తాడనేది ప్రశ్న.
ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను మ్యానేజ్ చేశాడు ప్రభాస్. ఓ వైపు `సలార్` చేస్తూనే `ప్రాజెక్ట్ కే`(కల్కి), మారుతి సినిమాల షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు నెక్ట్స్ కూడా అదే చేస్తాడా? అనేది ప్రశ్న. అదే జరిగితే గెటప్‌ల విషయంలో తేడా వస్తుంది. రెండు భిన్నమైన సినిమాలు. కావును.. సెట్ కావడం కష్టం. `సలార్ 2`కి గ్యాప్ ఇస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఇప్పుడు ప్రభాస్ లైనప్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. `కల్కి`, మారుతి మూవీ, `స్పిరిట్`, `సలార్2`తోపాటు హను రాఘవపూడి మూవీ ఇలా అన్నీ భారీ సినిమాలు క్యూలో ఉన్నాయి. గ్యాప్ లేకుండా అలరించేందుకు రాబోతున్నాయి.
