Asianet News TeluguAsianet News Telugu

సందీప్‌ రెడ్డి వంగా చేయాల్సిన మొదటి సినిమా ఎవరితో తెలుసా? వర్క్ అయితే ఆ హీరో లెక్కే వేరు!

వేరే హీరోతో చేయాలని నిర్మాత అన్నాడట. కానీ సందీప్‌ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేసేపరిస్థితి లేదు. దీంతో ఫ్రస్టేషన్‌లో మోకాకి వచ్చి కూర్చున్నాడట. 

sandeep reddy vanga first movie details that young hero just missed it arj
Author
First Published Dec 5, 2023, 3:49 PM IST

సందీప్‌ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు సినిమాల్లో ఒక సరికొత్త బ్రాండ్. సినిమా్లో ట్రెండ్‌ సెట్టర్‌ కి కేరాఫ్‌. `యానిమల్‌` సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్న దర్శకుడు. తెలుగు డైరెక్టర్‌ అయి ఉండి బాలీవుడ్‌లో జెండా ఎగరేస్తున్న దర్శకుడు. ఆయన రూపొందించిన `యానిమల్‌` సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రణ్‌ బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. 

అయితే ఈ సందర్భంగా సందీప్‌ రెడ్డి నేషనల్‌ వైడ్‌గా టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆయన గురించిన అంశాలు ఆరా తీసే పనిలో అభిమానులుంటున్నారు. ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు, బ్యాక్‌ గ్రౌండ్‌ విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అయితే సందీప్‌ రెడ్డి చేయాల్సిన మొదటి సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెడికో బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన సందీప్‌.. డైరెక్షన్‌పై ఆసక్తితో డాక్టర్‌ వృత్తిని వదిలేసి దర్శకుడిగా మారారు. 

అయితే ఫిల్మ్ స్కూల్‌లో డైరెక్షన్‌ నేర్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా.. ఓ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడట. ఆ సమయంలో ఒక సాఫ్ట్ లవ్‌ స్టోరీ కథ పట్టుకుని హీరోకోసం తిరుగుతున్నారు. 2010-11 టైమ్‌లో. అప్పుడే నానిది `రైడ్‌` సినిమా రిలీజ్‌అయ్యింది. అందులో నాని బైక్‌ నడిపే సీన్‌ చూసి ఫిదా అయ్యాడట సందీప్‌. దీంతో ఎలాగైనా నానికి ఈ కథ చెప్పాలని తిరుగుతున్నాడట. కానీ ఎలా కలవాలో తెలియదు. నిర్మాత రెడీగా ఉన్నాడు. కానీ నానికి ఈ కథ ఎలా చెప్పాలని చూస్తున్నాడట. 

వేరే హీరోతో చేయాలని నిర్మాత అన్నాడట. కానీ సందీప్‌ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేసేపరిస్థితి లేదు. దీంతో ఫ్రస్టేషన్‌లో మోకాకి వచ్చి కూర్చున్నాడట. ఆ సమయంలో అక్కడే నాని కొంత మంది ఫ్రెండ్స్ తో సరదా డిస్కషన్‌లో ఉన్నారట. ఓ వ్యక్తి వచ్చిన గన్‌ టేబుల్‌ మీద పెట్టి టీ తాగుతున్నాడు. ఎంత ట్రై చేసిన నాని ఐస్‌ని బ్రేక్‌ చేయలేకపోతున్నారట. చాలా సేపు ఉన్నా అది వర్కౌట్‌ కాలేదు. మధ్యలో వెళ్లి కలుద్దామా? అంటే మళ్లీ విసుక్కుంటే తట్టుకోలేనని వెళ్లలేకపోయాడట. ఆ తర్వాత ఆ కథే పక్కన పెట్టాడట. ఆ సమయంలో నాని చేసే సినిమాలు చూసి, ఆయన గ్రోత్‌ చూసి చాలా హ్యాపీ అయ్యాడట. కానీ సినిమా చేయలేకపోయానని తెలిపారు సందీప్‌. 

అలా నాని.. సందీప్‌ రెడ్డి వంగాతో తొలి సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే, నాని హీరోగా సందీప్‌ రెడ్డి వంగా సినిమా చేసి ఉంటే ఇప్పుడు నాని ఇమేజ్‌ మారిపోయేది, ఆయన రేంజ్‌ మారిపోయేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఇటీవల నానితో చేసిన చిట్‌ చాట్‌లో చెప్పుకొచ్చారు సందీప్‌ రెడ్డి వంగా. అయితే ఇకపై అలా వెయిట్‌ చేయోద్దని, కథ అనిపిస్తే డైరెక్ట్ గా వచ్చి చెప్పొచ్చని, ఆ గ్యాప్‌ ఇవ్వొద్దని నాని చెప్పడం విశేషం. 

సందీప్‌ రెడ్డి వంగా అనేక ప్రయత్నాల అనంతరం విజయ్‌ దేవరకొండతో `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని తీశారు. అప్పుడే `ఎవడే సుబ్రమణ్యం`తో హిట్‌ అందుకున్నారు నాని, విజయ్‌ దేవరకొండ. విజయ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత `పెళ్లి చూపులు`తో హిట్‌ అందుకున్నారు. ఆ వెంటనే `అర్జున్‌ రెడ్డి` సినిమాతో వచ్చి సంచలనం సృష్టించారు. అట్నుంచి సందీప్‌ అదేసినిమాని హిందీలో రీమేక్‌ చేశారు. `కబీర్‌ సింగ్‌`గా చేసి హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు `యానిమల్‌`తో సంచలనం క్రియేట్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాని.. `హాయ్‌ నాన్న` చిత్రంలో నటించారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios