గత నాలుగైదు రోజులుగా సందీప్ రెడ్డి వంగ వివాదంలో మునిగితేలుతున్నారు. ఆయనకు సపోర్ట్ చేసే కొందరు, విమర్శించే సెలబ్రెటీలతో ఆయన పేరు మీడియాలో మారు మ్రోగుతోంది. కబీర్ సింగ్ విజయం కన్నా ఈ వివాదమే ఎక్కువ పబ్లిసిటీ సంపాదిస్తోంది. అయితే ఈ వివాదం సందీప్ రెడ్డిని బాధపెడుతోందిట. తను కబీర్ సింగ్ విజయం అస్వాదించకుండా ఈ తలనొప్పి ఏమిటా అని తల పట్టుకుంటున్నారట. 

అయితే  ఈ వివాదం నుంచి బయిటపడి అందరికి ఒక్కసారిగా ఎదురుసమాధానం చెప్పాలంటే తను పెద్ద స్టార్ తో సినిమా చెయ్యటమొకటే మార్గమని భావిస్తున్నారట. అప్పుడు తనను ఎవరూ వేలెత్తి చూపరని, తనను విమర్శించేవాళ్లకు అది అలా చేస్తే ఫెరఫెక్ట్ రిప్లై ఇచ్చినట్లు అవుతుందని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లులో బిజీగా ఉన్నారట. తెలుగులో మహేష్ తో అనుకున్నా కుదరదని అర్దమవటటంతో హిందీలో సల్మాన్ తో కానీ తనపై ఆసక్తి చూపించే మరో స్టార్ తో గానీ సినిమా చేయాలని నిర్ణయంచుకున్నారట. అందులో భాగంగా షారూఖ్ ఖాన్ ని సైతం కలవబోతున్నట్లు తెలుస్తోంది. 

అర్జున్ రెడ్డి చిత్రంలో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ కబీర్ సింగ్ తో అంతకు మించి అన్న స్దాయిలో హిట్ కొట్టారు. దాంతో హిందీ, తెలుగు పరిశ్రమలలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది.  అయితే ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్‌ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు.  అదే వివాదం తెచ్చి పెట్టింది.