బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా కూడా హీరోగా క్లిక్కవడం అనేది అంత సాధారణ విషయం కాదు. సినిమా కోసం ఎంత కష్టపడినా ఫైనల్ గా ఆడియెన్స్ కి నచ్చితేనే స్టార్ హోదా అందుకుంటారు. అందుకోసం పలువురు పారితోషికం ఇవ్వకపోయినా సినిమాల్లో నటిస్తుంటారు. అదే తరహాలో సందీప్ కిషన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 

అయితే కొన్ని సినిమాలకు మంచి లాభాలు వచ్చినా కూడా అతనికి డబ్బు అందలేదట. ఈ విషయాన్నీ నిను వీడని నీడను నేనే సినిమా ప్రమోషన్స్ లో  సందీప్ బయటపెట్టాడు. సందీప్ కిషన్ ఆ సినిమాను సొంతంగా నిర్మించాడు. ఈ శుక్రవారం ఆ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'స్ట్రగుల్ అవుతున్న సమయంలో తక్కువ డబ్బుతో కొంత మంది సినిమాలు నిర్మిస్తే అందులో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాను. చేసిన 20 సినిమాల్లో 14 సినిమాల రెమ్యునరేషన్ అందుకోలేదు' అని సందీప్ తెలిపాడు. సినిమా హిట్టయితే తరువాత చూసుకుందాం అని చెప్పిన వారి మాటలు నమ్మి నటించిన సందర్భాలు ఎక్కువని. అయితే సినిమాకు కలెక్షన్స్ వచ్చినా కూడా చాలా మంది డబ్బులు ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు