ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సందీప్ కిషన్ ఆ తరువాత నార్త్ సౌత్ తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి చోట అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనంతరం ఈ హీరోకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఏ సినిమా కూడా కమర్షియల్ గా హిట్టవ్వలేదు.  తెలుగులో దాదాపు 10 సినిమాల వరకు వరుసగా నీరాశపరిచాయి. 

అయితే సందీప్ ఇప్పుడు ఓ హిట్టు ఫార్ములాను వాడబోతున్నాడు. హారర్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు ఈ మధ్య జనాలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. భయపెడితే హిట్ అందుకున్నట్టే. ఫెడవుట్ అయిన సిద్దార్థ్ కూడా హారర్ కాన్సెప్ట్ గృహంతో వచ్చి హిట్టు కొట్టాడు. ఇక నిఖిల్ కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి మార్కెట్ సెట్ చేసుకున్నాడు. 

అయితే ఇప్పుడు సందీప్ కిషన్ నిను వీడని నేను అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దెయ్యం ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇవ్వడం పక్కా అని చిత్ర యూనిట్ చెబుతోంది. సక్సెస్ కోసం ఎన్నో వేరియేషన్స్ లో ప్రయత్నాలు చేసిన ఈ హీరో ఇప్పుడు ఫైనల్ గా దెయ్యాన్ని నమ్ముకున్నాడు. మరి ఆ దెయ్యం ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.