దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. కాగా.. ఈ వైరస్ ప్రభావం బెంగళూరు నగరంలోనూ ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. కాగా... ప్రముఖ హీరో సుదీప్ ఇంటి సమీపంలోనూ ఈ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. సుదీప్ ఇంటి సమీపంలో ఓ వ్యక్తికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. హొసకెరెహళ్లిలోని రోడ్డుని సీజ్ చేశారు.  కాగా...  మరో నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మీ, మరో నటుడు రవిశంకర్‌గౌడ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని రవిశంకర్‌గౌడ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. తన పిల్లలను దేవుడే కాపాడాలని ఆయన వేడుకొన్నారు. ఇక ఇంటి వాకిళ్లను 14 రోజుల పాటు తెరవటానికి సాధ్యం కాదని పోస్టులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుదీప్, గణప, సైజన్‌లు పిల్లలను తీసుకొని తమ ఇంటికి రావాలని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. హొసకెరెహళ్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉండగా, వీరితో పాటు దర్శన్, పూజా గాంధీలు అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వదంతులను ఆమె కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.