పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ ఎంపికైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో ఐశ్వర్య డేట్స్ క్లాషెస్‌ అయ్యాయి. 

పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan), రానా(rana) కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్‌`(bheemla nayak). మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌, డేనియర్‌ శేఖర్‌ పాత్రలో రానా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్‌ వల్ల జరిగే సంఘర్షణ, గొడవ నేపథ్యంలో సాగే చిత్రమిది. పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ ఎంపికైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో ఐశ్వర్య డేట్స్ క్లాషెస్‌ అయ్యాయి. దీంతో ఆమె స్థానంలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ని ఎంపిక చేశారు. 

ఈ విషయాన్ని సంయుక్త తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. `లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా`భీమ్లా నాయక్` లో రానా సరసన నటిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఇంతకంటే బ్యూటీఫుల్‌ డెబ్యూ ఏముంటుంది. ఈ సినిమాతో సంక్రాంతి మాసీవ్‌గా మారడం ఖాయం` అని ట్వీట్ చేసింది. 2016లో `పాప్‌కార్న్` చిత్రంతో హీరోయిన్‌గా మారింది సంయుక్త. మలయాళం, తమిళం, కన్నడలో నటిస్తుంది. తాజాగా `భీమ్లానాయక్‌`తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

Scroll to load tweet…