వివాదాస్పద జ్యోతిష్యుడిగా వేణు స్వామి భలే పబ్లిసిటీ పొందారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో క్రేజీ సెలెబ్రిటీ. సినీతారలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి వేణు స్వామి బోల్డ్ గా కామెంట్స్ చేస్తుంటారు.
వివాదాస్పద జ్యోతిష్యుడిగా వేణు స్వామి భలే పబ్లిసిటీ పొందారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో క్రేజీ సెలెబ్రిటీ. సినీతారలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి వేణు స్వామి బోల్డ్ గా కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళ జాతకాల గురించి సంచలన విషయాలు చెబుతుంటారు. సినీ తారల వ్యక్తిగత జీవితాలని కూడా వేణు స్వామి వదిలిపెట్టరు.
ఈ క్రమంలో వేణు స్వామికి బాగా ఫాలోయింగ్ పెరిగింది. హీరోయిన్లు ప్రత్యేకంగా వేణు స్వామి వద్దకు వెళ్లి పూజలు చేయడం చూస్తూనే ఉన్నాం. నిధి అగర్వాల్, రష్మిక, డింపుల్ హయతి లాంటి హీరోయిన్లు ఇప్పటికే వేణు స్వామి దగ్గర పూజలు నిర్వహించారు.
ఇప్పుడు వేణు స్వామి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరింది. ఆయన కోసం హీరోయిన్లు మాత్రమే కాదు డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని.. వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణు స్వామి ఆయన చేత కామాఖ్య దేవాలయంలో పూజలు చేయించారు.
వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ పూజ చేయడం జరిగిందట.ప్రసాదంగా చేపల కూర, మటన్ తీసుకువెళ్లినట్లు వేణు స్వామి సోషల్ మీడియాలో ప్రకటించారు. చేపలు, మటన్ ప్రసాదం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సముద్రఖని.. పవన్ కళ్యాణ్ తో బ్రో అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
