హృదయకాలేయం సినిమాతో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు సంపూర్ణేష్‌బాబు ఇప్పుడు సంపూర్ణేష్‌బాబుని ఆంధ్రప్రదేశ్‌ అంతా హీ ఈజ్‌ స్పెషల్ అంటోంది
ఇక, ఇప్పుడు సంపూర్ణేష్బాబుని ఆంధ్రప్రదేశ్ అంతా 'హీ ఈజ్ స్పెషల్' అంటోంది. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఉద్యమంలో.. అదీ ఆంధ్రప్రదేశ్ యువత పిలుపునిచ్చిన మౌన ప్రదర్శన అనే సరికొత్త ఉద్యమంలో కన్పించిన ఒకే ఒక్క సినిమా హీరో సంపూర్ణేష్బాబు. 'ఐ సపోర్ట్..' అన్నాడుగానీ, మాట నిలబెట్టుకుంటాడా.? అనుకున్నారంతా. సపోర్ట్ ఇచ్చాడు, విశాఖకు టిక్కెట్ కొనేశాడు. విశాఖలో వాలిపోయాడు. అంతలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేశారు.
అరెస్టయ్యేముందు సంపూర్ణేష్ మీడియాతో మాట్లాడాడు. 'విశాఖకి వచ్చాను.. ప్రత్యేక హోదాకి మద్దతిచ్చేందుకు. ఆంధ్రప్రదేశ్ యువతకు మద్దతిస్తున్నాను.. మద్దతివ్వకుండా, వారితో కలిసి మౌన దీక్షలో పాల్గొనకుండా హైద్రాబాద్కి వెళ్ళే ప్రసక్తే లేదు. యువత లేని భారతదేశాన్ని ఊహించుకోలేం. ఆ యువత వాయిస్ని అణగదొక్కాలనుకుంటే అది అసాధ్యం..' అంటూ సంపూర్ణేష్ చెప్పిన మాటలు ఇప్పుడు అతన్ని రియల్ హీరోని చేసేశాయి.
సంపూర్ణేష్ మాత్రమే కాదు, ఆయనతోపాటుగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా యువత చేపట్టిన మౌన నిరసనకు మద్దతు తెలిపేందుకు విశాఖ వచ్చానని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు.. అని నినదించారాయన.
