తెలుగు సినిమాల్లో వస్తున్న మూస ధోరణిలపై సెటైర్ గా వచ్చిన  'హృదయకాలేయం' అప్పట్లో సెన్సేషన్. ముఖ్యంగా ఆ సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన తీరు, రాజమౌళి ట్వీట్ అన్ని కలిసొచ్చాయి. ఆ తర్వాత వరసగా సంపూ సినిమాలు చేస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్  కావటం లేదు. మినిమం కామెడీగా కూడా మిగలటం లేదు. ఉన్నంతలో ‘కొబ్బరి మట్ట’ సినిమా బాగుందనిపించుకుంది.   'హృదయకాలేయం' తర్వాత అతనికి ఓ వర్గంలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఏర్పడింది. అదీ మెల్లిగా పలచబడిపోయింది.అల్లరి నరేష్ కు ఆల్టర్నేటివ్ అవుతాడు అనుకుంటే అంత సీన్ లేదు అన్నట్లు అయ్యింది.  

https://www.youtube.com/watch?v=8uRvs2UOlK0

అయితే అందుకు కారణం అతనితో కామెడీ సినిమా చేద్దామనుకునే వాళ్లే కానీ, అతను ఏ జోనర్ ఫిల్మ్ లకు సెట్ అవుతాడు అన్నది ఆలోచించే ప్లాన్ చేసేవాళ్లు కరవు అవటమే ఫెయిల్యూర్స్ కు కారణం అనిపిస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా  ‘క్యాలీఫ్లవర్‌’ అంటూ మరో కామెడీ సినిమాని ప్రకటించాడు. . ఫస్ట్‌లుక్‌లో సంపూర్ణేశ్‌బాబు ఆంగ్లేయుడిగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. టైటిల్‌తో పాటు ట్యాగ్‌లైన్ ‘శీలో రక్షతి రక్షితః’  కూడా కొత్తగా ఇంట్రస్టింగ్ గా ఉంది.

‘ధర్మో రక్షతి రక్షితః’ అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. జనాల్లోకి వెళ్లి పాపులరైన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది". ఇప్పుడు దీన్నే కొద్దిగా మార్చి ‘శీలో రక్షతి రక్షితః’  అంటున్నాడు సంపూర్ణేష్ బాబు. అంటే "శీలాన్ని మనం రక్షిస్తే ఆ శీలమే మనల్ని రక్షిస్తుంది" అని అర్దం. మరి సెటైర్ గా ఈ వాక్యం అన్నారో,బాగుందని వాడారో ఆయన లేటెస్ట్ ఫిల్మ్ చూస్తేనే తెలుస్తుంది.

పూర్తి ఎంటర్టైనర్  చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.కె మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. గూడురు శ్రీధర్ సమర్పకునిగా వ్యవహరించనున్నారు. వాసంతి హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ముజీర్ మాలిక్ కెమెరామేన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవల లాంఛనంగా మొదలైంది. మరి ఈ సినిమా తో అయినా సంపూ ఒడ్డున పడతాడో లేదోచూడాలి.   ‘క్యాలీఫ్లవర్‌’ నవ్విస్తే మరిన్ని నవ్వులు పువ్వులు వస్తాయి.

నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌
దీప్‌

సాంకేతిక నిపుణులు
స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని
ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని
బ్యానర్స్‌: మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి
సమర్పణ: శ్రీధర్‌ గుడూరు
స్టోరీ: గోపి కిరణ్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రజ్వల్‌ క్రిష్‌
డీఓపీ: ముజీర్‌ మాలిక్‌
ఎడిటర్‌:బాబు
డైలాగ్స్‌: రైటర్‌ మోహన్, పరమతముని శివరామ్‌