ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విల విలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజా జీవితం అస్తవ్యస్థంగా మారింది. మనిషి గడపదాటి అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న ఈ వైరస్‌ చైనా వూహాన్‌ నగరంలోని గబ్బిలాల మార్కెట్‌ నుంచి పుట్టిందని భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తన సినిమా ప్రమోషన్‌కు వాడేస్తున్నారు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు.

తాజాగా శనివారం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని పోస్టర్లన రిలీజ్ చేశారు. జూలై 30న రిలీజ్ కు రెడీ అవుతున్న ఆ సినిమా పోస్టర్‌లో సినిమా టైటిల్‌ స్థానంలో క్వశ్చన్‌ మార్క్‌ (?) మాత్రమే ఉంది. ఇక పోస్టర్‌ పై భాగంలో `ఉహాన్‌ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా` అని ఉంది.

అంటే చైనాలో కరోనా వైరస్‌ అవుట్‌ బ్రేక్‌ ముందు ఈ సినిమా షూటింగ్ జరిపినట్టుగా వెల్లడిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే పేరడీలతో ఫేమస్ అయిన సంపూ నిజంగా అక్కడ షూటింగ్ చేసుకోకపోయినా తన సినిమా ప్రమోషన్‌కు ఈ కరోనా నేపథ్యాన్ని కూడా వాడుకున్నాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నోలన్‌ మౌళి దర్శకుడు.  అయితే లాక్‌ డౌన్‌ కారణంగా సొంత గ్రామానికి వెళ్లిన సంపూ, ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తమ భార్య పిల్లలకు పట్టీలు, తయారు చేసిన సంపూ అందరితో మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.