జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో కళ్యాణ్ రామ్. అయితే పటాస్ అనంతరం అనుకున్నంతగా హిట్ అందుకోలేకపోయిన నందమూరి హీరో నెక్స్ట్ స్ట్రాంగ్ యాక్షన్ ప్రాజెక్టులతో సిద్దమవుతున్నాడు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసి ఆ తరువాత పలు అపజయాలను ఎదుర్కొన్న సంపత్ నంది నెక్స్ట్ కళ్యాణ్ రామ్ తో వర్క్ చేయనున్నాడు. బెంగాల్ టైగర్ - గౌతమ్ నంద సినిమాలతో హడావుడి బాగానే చేసినప్పటికీ సంపత్ పెద్దగా మెప్పించలేకపోయాడు. నెక్స్ట్ సినిమాను మళ్ళీ గోపీచంద్ తో చేయాలనీ అనుకున్నాడు. కానీ ఆ సినిమా అనుకోని విధంగా క్యాన్సిల్ అయ్యింది. 

ఇక ఇప్పుడు మళ్ళీ అదే యాక్షన్ స్టోరీని కళ్యాణ్ రామ్ తో చేయడానికి సంపత్ డిసైడ్ అయినట్లు సమాచారం త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. సొంత ప్రొడక్షన్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే కళ్యాణ్ రామ్ సినిమాను నిర్మించనున్నట్లు టాక్.