Asianet News TeluguAsianet News Telugu

Sammathame :ఫ్లాఫ్ అన్నారు కానీ మా సినిమా బ్లాక్ బస్టర్

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన చెప్పుకోదగ్గ చిత్రాలు సమ్మతమే మరియు చోర్ బజార్ . సినిమాలు రెండూ కూడా మొదటి రోజు ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నాయి ఓవరాల్ గా.   రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాల టాక్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను హెవీగానే ఉంది. మూడో రోజుకు చాలా చోట్ల  ఆల్ మోస్ట్ 25% రేంజ్ లో డ్రాప్స్  కనపడింది. అయితే వీకెండ్ కొన్ని చోట్ల కలెక్షన్స్  బాగున్నాయి. 

 Sammathame is working quite well in theatres
Author
Hyderabad, First Published Jun 27, 2022, 11:30 AM IST


‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్‌ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సమ్మతమే’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్‌ 24) విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ తో చేసారనే విమర్శలు వచ్చాయి. అయితే వాటి ఇంపాక్ట్ ఏమీ లేదు , సినిమా సూపర్ హిట్ అంటున్నారు కిరణ్ అబ్బవరం. 

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.... ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్‌. 'సమ్మతమే' మార్నింగ్‌ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్‌ అయింది.' అని తెలిపాడు కిరణ్‌ అబ్బవరం. 

గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్‌ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్‌ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్‌ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. 

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్‌ బజార్‌' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్‌) అమితాబ్‌ బచ్చన్‌ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్‌ 24)న విడుదైలన 'చోర్‌ బజార్‌'  ప్రేక్షకుల మనస్సులు దోచటంలో విఫలమైందనే చెప్పాలి. అయితే  ఈ సినిమా తన కెరీర్ కు బాగా ప్లస్ అయ్యిందంటున్నారు ఆకాష్.

''చోర్‌ బజార్‌' సినిమాతో మాస్‌ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్‌ దర్శకుడు జీవన్‌ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్‌) కన్నా 'చోర్‌ బజార్‌' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్‌ రాజు'' అని ఆకాష్‌ పూరి తెలిపాడు.  ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌ సమావేశంలో ''ఫస్ట్‌ టైమ్‌ 'చోర్‌ బజార్‌' వంటి ఒక కమర్షియల్‌ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios