Asianet News TeluguAsianet News Telugu

పుష్ప థర్డ్ సింగిల్.. 'సామీ సామీ' అంటూ మాస్ బీట్ తో దుమ్మురేపిన బన్నీ!

నేడు మూవీలోని థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. సామీ సామీ.. అంటూ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ రష్మిక పాడిన మాస్ బీట్ సాంగ్ ఇది. 

sami sami third single from pushpa this time devisri delivered a mass beat
Author
Hyderabad, First Published Oct 25, 2021, 5:16 PM IST

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న పుష్ప ది బిగినింగ్ ఐదు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుసగా చిత్రంలోని సాంగ్స్ ని విడుదల చేస్తున్నారు. Pushpa నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల కావడం జరిగింది. సెకండ్ సింగిల్ శ్రీవల్లి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ స్వరాలు తోడు కాగా, సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతుంది. 


కాగా నేడు మూవీలోని థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. సామీ సామీ.. అంటూ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ రష్మిక పాడిన మాస్ బీట్ సాంగ్ ఇది. సినిమా థీమ్ కి తగ్గట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ స్వరాలు సమకూర్చుతున్నారు. Sami sami సాంగ్ కి కూడా చంద్రబోస్ సాహిత్యం అందించారు. మౌనిక యాదవ్ పల్లెటూరి స్లాంగ్ లో పాడారు. ఇక సామి సామి పూర్తి లిరికల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. 


Sukumar-దేవిశ్రీ కాంబోలో సూపర్ హిట్ ఆల్బమ్స్ రావడం జరిగింది. అదే స్థాయిలో పుష్ప సాంగ్స్ అలరిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇక పుష్ప నుండి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంటుంది. అల్లు అర్జున్ తో సుకుమార్ చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప. రెండు భాగాలుగా పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు.

Also read నాగబాబును వదలని నెటిజన్లు... మీరెక్కడ తయారయ్యారు బాబూ, మ్యాచ్ చూడడం కూడా తప్పేనా...

మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో పుష్ప నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కి స్తుండగా, అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా, గంధపు చెట్లు నరికే కూలీగా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఇక Allu arjun ప్రత్యర్థిగా మలయాళ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. సునీల్, అనసూయ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. 

Also read మెగాస్టార్ తో పవర్ స్టార్ ముచ్చట్లు... పెళ్ళిలో కలిసి సందడి చేసిన మెగా బ్రదర్స్

Follow Us:
Download App:
  • android
  • ios