నటి సమీరారెడ్డి రాజమండ్రికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు రాకపోవడంతో పెళ్లి చేసుకొని నటనకి స్వస్తి చెప్పేసింది.

ప్రస్తుతం ఈమె తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. 1998లో ఆమె నటించిన ఓ ఆల్బం లో పాట షేర్ చేసింది. పంకజ్ ఉదా 'ఔర్ ఆహిస్తా' అనే ఈ పాటలో సమీరా నటించింది.

అప్పటి పాటను గుర్తు చేసుకుంటూ.. తన నటన అప్పుడే మొదలైందంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో నటించే సమయానికి తనకు నటన మీద ఆసక్తి లేదని కేవలం వీడియో షూటింగ్ ఆస్ట్రేలియాలో ఉంటుందనే కారణంతోనే నటించినట్లు చెప్పుకొచ్చింది.

కానీ తలరాతను ఎవరూ మార్చలేరంటూ.. ఈ పాట ఎప్పుడూ చూసిన భావోద్వేగాలకు గురవుతుంటాను అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చాలా క్యూట్ గా ఉన్నవంటూ కామెంట్స్ పెడుతున్నారు.