ఫ్యామిలీలలోకి వెళ్ళటంతో .. నాని సినిమాలు భాక్సాఫీస్ వద్ద మినిమం రెవిన్యూని గేదర్ చేసేస్తున్నాయి. హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా కలెక్షన్స్ వచ్చే పరిస్దితి మెల్లమెల్లగా నానికు వస్తోంది. దాంతో నాని సినిమా రిలీజ్ ఉందంటే  మిగతా హీరోలు తమ సినిమాలు ముందుకో వెనక్కో వెళ్లే పరిస్దితి క్రియేట్ అవుతోంది. మరీ స్టార్ హీరోలు అంటే ప్రక్కకు తప్పుకోరు కానీ మిగతా మిడిల్ హీరోలు తమ సినిమాలను నాని సినిమాపై వెయ్యాలంటే ఆలోచనలో పడుతున్నారు. ఇప్పుడు అదే పరిస్దితి సాయి ధరమ్ తేజ తాజా చిత్రం టీమ్ కు పట్టుకుంది.  నాని , సాయి ధరమ్ తేజ ల రెండు సినిమాలు ఒకే డేట్ న రిలీజ్ కు ముహూర్తం పెట్టుకున్నాయి.

ఇప్పుడున్న పరిస్దితుల్లో సాయి ధరమ్ తేజకు హిట్ చాలా అత్యవసరం. ఈ నేపధ్యంలో ఆయన  చిత్రలహరి సినిమా మొదలెట్టారు. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ షూటింగ్ మొదలెట్టిన ఈ చిత్రం రిలీజ్ ని ఏప్రియల్ 19,2019 అని డిసైడ్ చేసారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...అదే రోజున నాని కొత్త చిత్రం జెర్సీ టీమ్  కూడా రిలీజ్ ప్రకటించింది. ఈ మేరకు 146 రోజులు మాత్రమే ఉందంటూ పోస్టర్ కూడా వదిలింది. 

గుడ్ ఫ్రైడే వస్తుందని ఈ రెండు చిత్రాలు వాళ్లు రిలీజ్ డేట్స్ అప్పుడే ఫిక్స్ చేసారు.  అప్పటికి మహేష్ బాబు మహర్షి సినిమా రిలీజ్ అయ్యి...రెండు వారాలు అవుతుంది. పోనీ ఆ రోజుని రిలీజ్ డేట్ మిస్ చేసుకుంటే...ఎవెంజర్స్ సినిమా వచ్చేసి, మాగ్జిమం థియోటర్స్ ని ఆక్రమించేస్తుంది. ఈ నేఫధ్యంలో నాని వెనక్కి వెల్తాడా..సాయి ధరమ్ తేజ వెనక్కి వెళతాడా అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది.