వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లిన నాగార్జున బిగ్ బాస్ ఇంటి బాధ్యత కోడలు పిల్ల సమంతకు అప్పగించారు. కులు మనాలి నుండి నేరుగా బిగ్ బాస్ వేదికపై ఉన్న సమంతతో మాట్లాడిన నాగార్జున ఆమెను ఇంటి సభ్యులకు పరిచయం చేశాడు. సమంతను చూసిన హౌస్ మేట్స్ ఒకింత షాక్ మరియు ఎక్సయిట్మెంట్ కి గురయ్యారు. తన కంటే కూడా సమంత చాలా డేంజరస్ అని నాగార్జున ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. 

ఇక నా తెలుగులో తప్పులు ఉంటే వాటిని మంచి మనుసుతో అంగీకరించాలని చెప్పిన సమంత...ఫస్ట్ టైం భయం వేస్తుంది అంటూనే హోస్ట్ గా సత్తా చాటింది. ఇంటి సభ్యులను బాగానే అధ్యయనం చేసిన సమంత వాళ్లపై అనేక సెటైర్స్ వేశారు. సమంత కామెంట్స్ కి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. 

బిగ్ బాస్ హౌస్ లోని అందరు సభ్యుల ప్రవర్తన, మెంటాలిటీని ఖచ్చితంగా అంచనా వేసిన సమంత తెలివి తేటలకు మెచ్చుకోవలసిందే. చాలా వరకు తెలుగులోనే మాట్లాడిన సమంత మాటలు ప్రేక్షకులకు ముద్దుగానే అనిపించాయి. హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయిన సమంత హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారనేది టాక్. బిగ్ బాస్ ప్రేక్షకులకు సమంత హోస్ట్ బాగానే నచ్చేసినట్లు ఉంది. 

కాబట్టి నాగార్జున షూటింగ్స్ లో బిజీ కావడం వలన షో హోస్ట్ బాధ్యత నెరవేర్చలేక పోయినా సమంత సమర్ధవంతగా నడుపుతుందని అర్థం అవుతుంది. ఇక హోస్టింగ్ లో మామ నాగార్జునను సమంత అధిగమించారా లేదా అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ఎంత టీఆర్పీ దక్కించుకుంది అనేది తెలియాల్సి వుంది. దసరా పండగ సంధర్భంగా అనేక ప్రత్యేకతలతో ప్రసారమైన ఈ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు అందరు. ఆ లెక్కన నాగార్జున రికార్డు ని సమంత బద్దలు కొట్టే సూచనలు లేకపోలేదు.