విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోహైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది ఆశ్రిత.

అయితే ఆ పెళ్లి సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోని సమంత తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంకీ ఫ్యామిలీతో కలిసి సామ్ తీసుకున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. 

వెంకీ, అతడి భార్య నీరజ.. వారి ముగ్గురు కుమార్తెలతో పాటు సురేష్ బాబు కూతురు మాళవిక పొట్లూరి కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. అలానే '96' రీమేక్ లో నటించడానికి సిద్ధమవుతోంది. 
  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Full feels ❤️ @venkateshdaggubati @infinityplatter @malavikad 📷 @raj.rj

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Apr 23, 2019 at 3:44am PDT