పవన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి పవన్ పట్ల గౌరవభావంతో ఉండే సమంత ఒక్క రోజు ముందుగానే పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ నామ స్మరణతో మోతమోగిపోతోంది. జాతీయ స్థాయి పవన్ బర్త్ విషెస్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యం సమంత కూడా పవర్ స్టార్‌కు తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలిపింది.
పవన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి పవన్ పట్ల గౌరవభావంతో ఉండే సమంత ఒక్క రోజు ముందుగానే పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
`అద్భుతమైన పవన్ కళ్యాణ్ సర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. గొప్ప ఆలోచనలతోనే గొప్ప బాధ్యతలు తీసుకుంటారు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ ట్వీట్ చేసింది సమంత. సామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.