సమంత ఓ వైపు `సామ్‌జామ్‌` టాక్‌ షోతో, మరోవైపు అరడజను టీవీ యాడ్స్ తో ఫుల్‌ బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సినిమాలు లేకపోయినా ఇలా మల్టీఫుల్‌ వర్క్ తో బిజీగా గడుపుతోంది. అయితే `జాను` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయని సమంత ఇప్పుడు ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమానే ఫైనల్‌ చేసిందట. 

గుణశేఖర్‌ `శాకుంతలం` పేరుతో ఓ సినిమాని రూపొందించబోతున్నారు. దీన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రానాతో `హిరణ్య కశ్యప` చిత్రం చేయాల్సింది. అయితే దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి `శాకుంతలం` సినిమా తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అంతేకాదు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. 1889లో ఈ నాటకం నార్వే, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషల్లోకి అనువాదం అయ్యింది. 

ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా దీన్ని రూపొందించబోతున్నారు. అయితే ఇందులో శకుంతల పాత్రలో సమంతని తీసుకునే ఆలోచనలో ఉన్నారట గుణశేఖర్‌. మరో ముఖ్య పాత్ర అయిన దుష్యంత మహారాజుగా ఎవరు నటిస్తారనేది ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి సంబంధించి జనవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. అందులో శకుంతలగా సమంత పేరుని ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్‌.