ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది.
ప్రస్తుతం సమంత తన హెల్త్ బాగు చేసుకునేందుకు, చికిత్స తీసుకునేందుకు యుఎస్ వెళ్ళింది. దీనితో సమంత ఖుషి చిత్ర ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండడం లేదు. ఖుషి చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సిన భాద్యత విజయ్ దేవరకొండ పైనే పడింది. అయితే అవకాశం ఉన్న మేరకు సమంతని కూడా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
దీనికోసం న్యూయార్క్ లో ఉన్న సమంతకి విజయ్ దేవరకొండ అర్థరాత్రి వీడియో కాల్ చేశాడు. ఈ కాల్ లో సామ్, విజయ్ దేవరకొండ సరదాగా మాట్లాడుకున్నారు. సమంత కోసం విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలోని 'నా రోజా నువ్వే' అనే సాంగ్ ని అద్భుతంగా పాడాడు. దీనితో సమంత ముఖంలో చిరునవ్వు కనిపించింది.
అయితే నెటిజన్లు ఇది వీడియో కాల్ కాదు అని పసిగట్టేస్తున్నారు. ఒక సెటప్ చేసి రికార్డ్ చేసిన వీడియో అని అంటున్నారు. ప్రస్తుతం సమంత యుఎస్ లో ఉంది కాబట్టి వీడియో కాల్ అని చెబితే మంచి పబ్లిసిటీ వస్తుందని ప్లాన్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రి వీడియో కాల్స్ పేరుతో ఫేక్ ప్రమోషన్స్ ఎందుకు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అదేదో సమంత లైవ్ లోనే ఇంటరాక్ట్ కావచ్చు కదా అని సూచిస్తున్నారు.
వీడియో కాల్ కోసం ఎవరైనా గాగుల్స్ పెట్టుకుని రెడీగా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ మధ్యన విశ్వక్ సేన్ నడిరోడ్డులో హల్ చల్ చేయడం చూశాం. అలాంటి ప్రమోషన్స్ తో పోల్చుకుంటే సమంత, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ బెటర్ అని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
