సాధారణ కుటుంబం నుంచి స్దార్ హీరోయిన్ గా ఎదిగి, స్టార్ కు భార్యగా ఒదిగింది సమంత. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే అంశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. తాజాగా ఆమె ఓ విషయం చెప్తూ.... తాను చెబుతున్న విషయాన్ని అందరూ నమ్మాలని కోరింది. ఇంతకీ ఆ  విషయం ఏంటే...అబ్బాయిలు తమ అమ్మలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటుంటారన్న మాట విన్నారుగా? ఇది తన విషయంలో నిజమైందట. ఎలానో స్వయంగా ఫొటోలు సాక్ష్యం చూపెడుతూ మరీ  చెబుతోంది సమంత.

తాజాగా సమంత ఇక్కడ చూస్తున్న ఫొటోను  తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో తన భర్త నాగచైతన్య తన తల్లి లక్ష్మి, భార్య సమంతల మధ్య కూర్చున్నాడు. విశేషం ఏంటంటే, సమంత, లక్ష్మిలు ఒకే డిజైన్, ఒకే కలర్ ఉన్న డ్రస్ లు  ధరించివుండటమే. 

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.., ఇలా ఒకే డ్రస్ వేసుకోవాలన్న విషయాన్ని సమంత ఏమీ ముందుగా ప్లాన్ చేయలేదంటోంది.    తాను ఒక రోజంతా తన అత్తయ్యతో సంతోషంగా గడిపానని, ఇద్దరం ముందుగా ప్లాన్ చేసుకోకుండా ఒకే రకమైన డ్రస్ వేసుకుని బయటకు వచ్చామని, దీన్ని అందరూ నమ్మాలని చెప్పింది. అమ్మలాంటి భార్య కావాలని అబ్బాయిలు అనుకుంటారని, తమ విషయంలో అది నిజమైందని ఆనందంగా చెప్పింది. కానీ అభిమానులు మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాం కానీ లేకపోతే నమ్మలేం అంటూ కామెంట్స్ చేస్తున్నాకాగా, ఈ చిత్రం ఇటీవల వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహం సందర్భంగా తీసినదే.