Asianet News TeluguAsianet News Telugu

'గూఢచారి'గా సమంత.. వైరల్ అవుతున్న క్రేజీ డీటెయిల్స్

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Samantha to play spy in this web series
Author
First Published Sep 29, 2022, 5:13 PM IST

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పోషించిన పాత్ర అభిమానులకు ఒక షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 

డీగ్లామర్ రోల్ లో నటిస్తూ నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించింది. అయితే కొందరు ఫ్యాన్స్ సమంతని ఈ పాత్రలో జీర్ణించుకోలేకపోయారు. కానీ సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే సమంత మరో సిరీస్ లో నటించబోతోంది. 

వరుణ్ ధావన్ తో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకోనుంది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఉండబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం సమంత శిక్షణ మొదలు పెట్టినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2లో రెబల్ లేడీగా నెగిటివ్ రోల్ ప్లే చేసిన సామ్.. ఈ సిరీస్ లో గూఢచారిగా నటించబోతున్నట్లు టాక్. 

సిడాటెల్ అనే అమెరికన్ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్ గా తెరకెక్కించనున్నారు. సామ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ప్రత్యేక ట్యూటర్ సమక్షంలో హిందీ నేర్చుకుంటోంది అట. మరి గూఢచారిగా సామ్ ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే కొంతకాలంగా సమంత ఆరోగ్యంపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios