Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని వారింటి కోడలు ఎన్టీఆర్ తో మళ్లీ చేస్తుందట

  • జూనియర్ ఎన్టీఆర్ సరసన పలు సినిమాల్లో నటించిన సమంత
  • ఎన్టీఆర్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్
  • మరోసారి ఎన్టీఆర్ తో నటించేందుకు రెడీ అవుుతన్న అక్కినేని కోడలు
samantha to act with ntr again fifth time

సమంత, ఎన్టీఆర్ ల కాంబినేషన్ గురించి ఇటు హిట్ కాంబినేషన్ అని చెప్పలేం అటు ఫ్లాప్ కాంబినేషన్ అనటానికీ వీల్లేదు. వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలు రకరకాల ఫలితాలిచ్చాయి. ఎన్టీఆర్, సమంత కలిసి నటించిన సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్. మరోటి హిట్.. ఇంకో రెండు డిజాస్టర్లు. తొలిసారి ఈ జోడీ కలిసి నటించిన సినిమా ‘బృందావనం’ మంచి ఫలితాన్నే అందుకుంది కానీ.. ఆ తర్వాత వచ్చిన రభస, రామయ్యా వస్తావయ్యా తేలిపోయాయి. ఐతే గత ఏడాది ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ కొట్టారు ఎన్టీఆర్, సమంత. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో ఐదో సినిమా రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా లేటెస్ట్ అడిషన్ సమంతే అంటున్నారు.

‘పవర్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ‘జై లవకుశ’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆ మూడు పాత్రలకూ ముగ్గురు హీరోయిన్లు కావాలి. ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నా ఫిక్సయింది. మరో హీరోయిన్‌గా నివేదా థామస్ అంటున్నారు.

ఇవి కాక..మరో ఎన్టీఆర్ పాత్ర కోసం కొంచెం తక్కువ నిడివిగల హీరోయిన్ క్యారెక్టర్ ఉందట. అతిథి పాత్రలాంటి.. ఆ పాత్రకు సమంతను అడుగుతున్నట్లు సమాచారం. ‘అఆ’ తర్వాత చాన్నాళ్ల పాటు తెలుగు సినిమాలు ఒప్పుకోని సమంత ఈ మధ్యే రామ్ చరణ్-సుకుమార్ సినిమాకు ఓకే చెప్పింది. దీంతో పాటు ‘రాజుగారి గది-2’లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటున్నారు.  ఏం సంగతనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios