సమంత టైమ్ స్టార్ట్.. `శాకుంతలం` ఫస్ట్ సింగిల్ `మల్లికా` వచ్చేది అప్పుడే..
ఆ మధ్య `యశోద`తో అందరిని అలరించింది సమంత. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. ఆమె నటించిన `శాకుంతలం` సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.

మరోసారి ఇండియన్ తెరపై సమంత రచ్చ చేసేందుకు వస్తుంది. ఆ మధ్య `యశోద`తో అందరిని అలరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. దీనికి విశేష స్పందన రాబట్టింది.
ఇక ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు. మొదటి పాటని విడుదల చేయబోతున్నారు. `మల్లికా` అంటూ సాగే పాటని రేపు విడుదల చేయబోతున్నారు. తెలుగు, కన్నడ, హిందీలో ఇది `మల్లికా`గా, తమిళంలో `మల్లిగా` గా, మలయాళంలో `మల్లికే` గా విడుదల కాబోతుంది. `శాకుంతలం` తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో ఇందులో శాకుంతలగా సమంత లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది. గోపికలను తలపించేలా ఉంది సామ్. అందం అదరహో అనేలా దేవకన్యలా మతిపోగొడుతుంది. ఈ పోస్టర్ రచ్చ చేస్తుంది. పోస్టర్‌తోనే కాదు, ఇప్పుడు సమంత కూడా కంటిన్యూగా నెల రోజులపాటు సందడి చేయబోతుందని, మరోసారి సమంత టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.
సమంత.. శకుంతలగా నటించే ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్‌బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గుణటీమ్ వర్క్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఎపిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో మైథలాజికల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ ప్రధానంగా సినిమా సాగుతుందని చె