అదే ప్రశ్న కూతురు అడిగితే?.. సమంత స్ట్రాంగ్ కౌంటర్!

First Published 11, Oct 2018, 3:23 PM IST
samantha strong counter to netizens
Highlights

మీటూ ఉద్యమానికి ఇప్పుడు అందుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. హీరోయిన్స్ లైంగిక వేధింపుల గురించి కొంచెం చెప్పినా వారికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. అయితే మీటూ అనే హ్యాష్ ట్యాగ్ కి మద్దతు ఎంత లభిస్తున్నా అక్కడక్కడా ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. 

మీటూ ఉద్యమానికి ఇప్పుడు అందుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. హీరోయిన్స్ లైంగిక వేధింపుల గురించి కొంచెం చెప్పినా వారికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. అయితే మీటూ అనే హ్యాష్ ట్యాగ్ కి మద్దతు ఎంత లభిస్తున్నా అక్కడక్కడా ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. సమంత కి ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పి కౌంటర్ ఇచ్చారు. 

ఇటీవల చిన్మయి శ్రీపాద చిన్నప్పుడు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సమంత సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇద్దరు నెటిజన్స్ సమంతను డిఫరెంట్ గా ప్రశ్నలు అడిగారు.. ఒక నెటిజన్ తను శ్రీ దత్త వివాదం గురించి ప్రస్తావిస్తూ.. పదేళ్ల కిందట జరిగిన వివాదం గురించి ఇప్పుడు చెబితే ఎలా ఒప్పుకుంటారు అని అడిగాడు. 

అందుకు సమంత.. ఇదే మా భయం.. ఎక్కడ మీరు నిజం ఒప్పుకోరో అని సమయం కుదిరినప్పుడు నిజాల్ని చెబుతుంటాం అన్నారు. ఇక మరో నెటిజెన్ మాట్లాడుతూ.. ఇవాళ మా కొడుకు మీటూ అంటే ఏమిటని అడిగాడు. అందుకు నేను.. ఆడవారి రిటర్మెంట్ ఇన్సూరెన్స్ పథకమని అన్నా. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చే ఆడవాళ్లు కెరీర్ ఎండ్ అయ్యాక ఈ భీమా వాడుకుంటారు. అప్పుడు మీడియా న్యూస్ అందిస్తుందని చెప్పగానే మా అబ్బాయి గాడ్ బ్లెస్‌ ఇండియా అన్నాడని సమంతకు వివరించాడు. 

దీంతో సమంత అతనికి కొంచెం గట్టిగానే 'కౌంటర్ ఇచ్చింది. ఇదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం సమాధానం ఇస్తావని సమంత పేర్కొన్నారు.       

loader