ఒకప్పుడు ఇతర భాషల హీరోయిన్లు తెలుగులో నటిస్తే.. డబ్బింగ్ కోసం మాత్రం ఇతరులపై

ఒకప్పుడు ఇతర భాషల హీరోయిన్లు తెలుగులో నటిస్తే.. డబ్బింగ్ కోసం మాత్రం ఇతరులపై ఆధారపడేవారే కానీ తెలుగు మాత్రం నేర్చుకునేవాళ్ళు కాదు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ సైతం ఇప్పటికీ తెలుగు నేర్చుకోలేదు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెటిన కొన్ని నెలలకే తెలుగు నేర్చేసుకొని ఏకంగా డబ్బింగ్ లు కూడా చెప్పుకుంటున్నారు. స్టార్ హీరో సమంతా తెలుగు చక్కగా మాట్లాడగలదు కానీ డబ్బింగ్ చెప్పడానికి మాత్రం వెనుకడుగు వేసేది.

కానీ 'మహానటి' సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది ఒక్క సినిమాకు మాత్రమేపరిమితమవుతుందనుకుంటే పొరపాటే. తాజాగా మరో సినిమాకు డబ్బింగ్ చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తమిళంలో ఆమె నటించిన 'సూపర్ డీలక్స్' సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది సమంతా. వరుసగా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నప్పటికీ అది కూడా దర్శకనిర్మాతల ఇష్టానికే వదిలేసినట్లు తెలుస్తోంది.

Scroll to load tweet…