MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?

శర్వానంద్‌ హీరోగా చాలా గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు ఆయన `నారీ నారీ నడుమ మురారి` అనే హిట్‌ మూవీ టైటిల్‌తో వచ్చాడు. మరి ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా? శర్వాకి ఎట్టకేలకు హిట్‌ పడిందా? 

6 Min read
Author : Aithagoni Raju
Published : Jan 15 2026, 12:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ

శర్వానంద్‌ కి హిట్లు లేక చాలా కాలం అవుతుంది. ఆయన సినిమాలు కూడా రెగ్యూలర్‌గా రావడం లేదు. శర్వా సినిమాలు చేస్తున్నాడా? లేదా అనే సందేహం కూడా ఆడియెన్స్ లో ఉంది. దీంతో అనేక రూమర్స్ ఆయనపై వచ్చాయి. కానీ వాటికి బ్రేక్‌లు వేస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో వస్తున్నారు. అందులో ఒకటి `నారీ నారీ నడుమ మురారి` మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యింది. `సామజవరగమన` ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందడం విశేషం. ఇందులో శర్వానంద్‌ కి జోడీగా సంయుక్త, సాక్షివైద్య హీరోయిన్లుగా నటించారు. నరేష్‌, సిరి హనుమంతు, వెన్నెల కిశోర్‌, సత్య, సంపత్‌, గెటప్‌ శ్రీను, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రై లి, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగని పురస్కరించుకుని బుధవారం (జనవరి 14న) సాయంత్రం నుంచి విడుదలయ్యింది. పూర్తి రిలీజ్‌ గురువారం నుంచి ఉంటుంది. మరి ఈ మూవీతో అయినా శర్వానంద్‌ హిట్‌ కొట్టాడా? ఈ సంక్రాంతికి ఆయనకు కలిసి వచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
నారీ నారీ నడుమ మురారి మూవీ కథ ఇదే
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ కథ ఇదే

గౌతమ్‌ (శర్వానంద్‌) తన నాన్న కార్తీక్‌(నరేష్‌)కి రెండో పెళ్లి కోసం చాలా ఛేజింగ్‌లు చేస్తాడు. నాన్నకి సగం వయసు ఉన్న అమ్మాయి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి చేస్తాడు. విచిత్రం ఏంటంటే కార్తీక్‌, పల్లవి ప్రేమించుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాత్రికి రాత్రి లేపుకుపోయి గుళ్లో పెళ్లి చేస్తారు. కట్‌ చేస్తే గౌతమ్‌ కూడా ఆల్‌ రెడీ మరో అమ్మాయి నిత్య(సాక్షి వైద్య)ని లైన్‌లో పెడతాడు. రెగ్యూలర్‌గా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ, ఛాటింగ్‌లు, డేటింగ్‌లు చేస్తుంటాడు. నిత్య తండ్రి పెద్ద లాయర్‌(సంపత్‌ రాజ్‌). ఓ రోజు గౌతమ్‌ని తండ్రికి పరిచయం చేస్తుంది నిత్య. ఆ సమయంలో తన కేరళా లవ్‌ స్టోరీ చెబుతాడు. అది ఆయనకు నచ్చకపోయినా కూతురు కోసం కన్విన్స్ అవుతాడు. ఇక గౌతమ్‌ పేరెంట్స్ ని కలిసినప్పుడు కార్తీక్‌, ఆయన భార్య పల్లవిని చూసి షాక్‌ అవుతాడు నిత్య తండ్రి. వీరిది వింత, విచిత్రమైన ఫ్యామిలీ అని ముందు నో చెబుతాడు. తర్వాత ఓకే చెబుతాడు. అయితే పెళ్లి మాత్రం రిజిస్టర్‌ మ్యారేజ్‌లోనే చేయాలని పట్టుపడతాడు. దీంతో రిజిస్టర్‌ ఆఫీస్‌ కి వెళ్లగా, అక్కడ గౌతమ్‌కి దియా(సంయుక్త)తో పెళ్లి చేసిన రిజిస్టారే(సునీల్‌) ఉంటాడు. ఆ సమయంలో ఆ అధికారికి గౌతమ్‌ సవాల్‌ కూడా విసురుతాడు. గౌతమ్‌ని చూడగానే ఆ ఆఫీసర్‌కి గతం గుర్తొస్తుంది. ఈ పెళ్లి చేయాలంటే దియాతో డైవర్స్ పేపర్‌ కావాలనే కిటుకు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో దియా మళ్లీ గౌతమ్‌ లైఫ్‌లోకి వస్తుంది. దీంతో ఈ ఇద్దరిని గౌతమ్‌ ఎలా హ్యాండిల్‌ చేశాడు? మళ్లీ దియాకి కనెక్ట్ అయ్యాడా? నిత్యకే ఫిక్స్ అయ్యాడా? డైవర్స్ పేపర్స్ తెచ్చాడా? దియాతో గౌతమ్‌ లవ్‌ స్టోరీ ఏంటి? వాళ్లు ఎలా విడిపోయారు? ఇద్దరి అమ్మాయిల మధ్య గౌతమ్‌ ఎలా నలిగిపోయాడా? చివరికి ఆయన లైఫ్‌కి ఎలాంటి కార్డ్ పడిందనేది సినిమా.

Related Articles

Related image1
'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?
Related image2
BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
37
నారీ నారీ నడుమ మురారి మూవీ విశ్లేషణ
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ విశ్లేషణ

ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. ఒక్క రాజాసాబ్‌ తప్పితే మిగిలిన అన్ని సినిమాలు ఒకే జోనర్‌లో ఉన్నాయి. అన్నీ ఫ్యామిలీ ఎలిమెంట్లతో, అమ్మాయి, లవర్‌, భార్యలతో గొడవల నేపథ్యంలోనే రూపొందాయి. బ్యాక్‌ డ్రాప్‌లు వేరుగానీ, అన్నీ పండగ సీజన్‌ క్యాష్‌ చేసుకునేందుకు వచ్చాయి. అయితే వీటిలో చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. రవితేజ, నవీన్‌ పొలిశెట్టి చిత్రాలు యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఎండ్‌ కార్డ్ వేసేందుకు వచ్చిన శర్వానంద్‌ `నారీ నారీ నడుమ మురారి` మూవీ ఫలితం ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ప్రశ్న. అయితే ఈ సినిమా హ్యాపీ ఎండింగ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. గత చిత్రాలకు కంటే బెటర్‌గానే ఉంది. అయితే కథగా పెద్దగా ఏం లేదు. నిబ్బా నిబ్బి, జెంజీ కామెడీని, సోషల్‌ మీడియా కామెడీని నమ్ముకొని చేసిన చిత్రమే. కాకపోతే స్క్రిప్ట్ పరంగా, స్క్రీన్‌ ప్లే పరంగా మ్యాజిక్‌ చేశారు. బాగా రాసుకున్నారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. సీన్‌ బై సీన్‌ పర్‌ఫెక్ట్ గా, పక్కాగా రాసుకున్నారు. ట్రెండీ కామెడీ డైలాగ్‌లను సందర్భాను సారంగా పంచ్‌ డైలాగ్‌ల రూపంలో వాడుతూ ఆద్యంతం నవ్వులు పూయించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు చిన్న చిన్న ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. ప్రతి ట్విస్ట్, టర్న్ ల వద్ద ఫన్‌ని బాగా వర్కౌట్‌ చేశారు. అది ఇందులో బాగా పండింది. నవ్వులు పూయించింది. ముఖ్యంగా నరేష్‌ పాత్రని బాగా రాసుకున్నారు. తన నిజ జీవితాన్ని జోడించి, వరుస పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తూ, ఈ ఏజ్‌లో కూడా మళ్లీ పెళ్లి అనే కాన్సెప్ట్, కూతురు వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆమెతో పిల్లల్ని కూడా కనడం వంటి నరేష్‌పై వచ్చే సీన్లు హిలేరియస్‌గా నవ్వించాయి. అదే సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. దీనికితోడు హీరో శర్వానంద్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయినట్టుగానే ఆయన నటన, కామెడీ టైమింగ్‌ కుదిరింది. చాలా ఎనర్జీతో నటించాడు. నేచురల్‌గా చేశాడు. అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. ఒక వైపు నరేష్‌ కామెడీతో డామినేట్‌ చేస్తుండగా, ఆయన్ని కూడా తనదైన యాక్టింగ్‌తో డామినేట్‌ చేశాడు శర్వానంద్‌.

47
నారీ నారీ నడుమ మురారి మూవీ ప్లస్‌ లు, మైనస్‌లు
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ ప్లస్‌ లు, మైనస్‌లు

సినిమా ప్రారంభంలోనే సిరితో నరేష్‌ పెళ్లి, దీనికి సత్య హెల్ప్ చేయడం హిలేరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత సిరి, నరేష్‌ మధ్య డైలాగ్‌లు, వారి రొమాన్స్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సంపత్‌, హీరోయిన్‌ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కేరళాలో హీరోహీరోయిన్ల లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. అందులోనూ కామెడీ వర్కౌట్‌ అయ్యింది. ఇలా ప్రతి సీన్‌లోనే ఫన్‌ని మేళవించి రూపొందించారు. వాటికి సోషల్‌ మీడియా పాపులర్‌ జోకులను జోడించి రక్తికట్టించారు. దీంతోపాటు శర్వానంద్‌, సంయుక్తల లవ్‌ స్టోరీని కూడా ఫన్నీగా రాసుకున్నారు. రిజిస్టార్‌ ఆఫీస్‌లో సునీల్‌, శర్వానంద్‌ ల మధ్య ఫన్ అదిరిపోయింది. మరోవైపు పెళ్లి విషయంలో, పిల్లల్ని కనే విషయంలో నరేష్‌ సలహాలు, డైలాగ్‌లు క్రేజీగా ఉన్నాయి. మరోవైపు సంపత్‌ రాజ్‌తోనూ వచ్చే సీన్లు కామెడీని పంచాయి. ఇంటర్వెల్‌లో ఇద్దరు హీరోయిన్లని తెరమీదకు తీసుకొచ్చి ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌ అంతా ఊహించినట్టుగానే ఉంటుంది. రెగ్యూలర్‌ డ్రామాగా సాగుతుంది. రొటీన్‌గా అనిపిస్తాయి. బాగా ల్యాగ్‌ అనేలా ఉంటాయి. కాకపోతే వాటిలోనూ కామెడీని జనరేట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క్లైమాక్స్ వరకు ఇలా డ్రామా, ట్విస్ట్ లతో నడిపించి నవ్వించారు. ఎస్‌కేఎన్‌ పంచ్‌లు, వేణు స్వామి పెళ్లి, గర్ల్ ఫ్రెండ్‌ సినిమా, ఇళయరాజా మ్యూజిక్‌, నిబ్బా నిబ్బి కాన్సెప్ట్, రోజా బతుకు జట్కా బండి, బిట్లు, బిట్‌ కాయిన్లు ఇలాంటి అనేక పంచ్‌లు ఆద్యంతం నవ్వించాయి. ముఖ్యంగా నరేష్‌ తన సొంత లైఫ్‌నే తన పాత్రలో మేళవించిన తీరు అదిరిపోయింది. దీనికితోడు దిల్‌ రాజు రెండో పెళ్లిపై కూడా సెటైర్లు ఆకట్టుకుంటాయి. ఇవే సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ లో కాస్త ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి ముగించిన తీరు బాగుంది. అయితే సినిమా కథగా పెద్దగా లేదుగానీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్‌లు బాగా రాసుకున్నారు. అదే ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి. మధ్య మధ్యలో సినిమా పడిపోతున్న సమయంలో ఏదో ఒక మంచి కామెడీ ట్రాక్‌తో గట్టెక్కించారు. బోర్‌ లేకుండా నడిపించారు. ఇలా ఈ మూవీ ఈ సంక్రాంతికి అదిరిపోయే ముగింపుని ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి హిట్‌ సినిమాల జాబితాలో చేరిపోతుంది. శర్వానంద్‌కి ఈ సంక్రాంతికి కలిసి వచ్చిందనే చెప్పొచ్చు.

57
నారీ నారీ నడుమ మురారి మూవీ ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే

గౌతమ్‌ పాత్రలో శర్వానంద్‌ బాగా నటించాడు. లుక్‌ వైజ్‌గా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. నటన పరంగా, కామెడీ పరంగా ఇరగదీశాడు. పదేళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్‌ తీసుకొచ్చాడు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నా, శర్వా అందరిని డామినేట్‌ చేయడం విశేషం. ఆయన డైలాగ్‌ డెలివరీ, పంచ్‌లు, యాక్టింగ్‌, డాన్సులు ఇలా అన్నీంటినిలోనూ ది బెస్ట్ ఇచ్చాడు. నిత్యాగా సాక్షి వైద్య అదరగొట్టింది. తనకు మంచి పాత్ర పడింది. దియాగా సంయుక్తకి మరో మంచి పాత్ర దొరికింది. బాగా చేసింది. కాకపోతే చాలా బోద్దుగా కనిపించింది. నరేష్‌ పాత్ర హిలేరియస్‌గా ఉంటుంది. ఆయన పాత్రలో చాలా మంది రియల్‌ లైఫ్‌ సెలబ్రిటీలు ప్రతిబింబిస్తారు. నరేష్‌ తన వన్‌ మ్యాన్‌ షోతో చాలా సీన్లని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. పల్లవి పాత్రలో సిరి అదరగొట్టింది. నరేష్‌ సరసన చేయడమే పెద్ద సాహసం. అంతే బాగా నటించి మెప్పించింది. నవ్వించింది. ఇక మధ్య మధ్యలో సునామీలా వస్తూ సత్య ఇరగదీశాడు. లాయర్‌గా వెన్నెల కిశోర్‌ సైతం అదరగొట్టారు. సుదర్శన్‌ బాగా నవ్వించాడు. సాక్షి తండ్రిగా సంపత్‌ రాజుకి మరో మంచి పాత్ర పడింది. రిజిస్టార్‌గా సునీల్‌ మరోసారి రెచ్చిపోయాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. అయితే అందరు ఆర్టిస్ట్ లు, ఆయా పాత్రలకు పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యారు.

67
నారీ నారీ నడుమ మురారి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే
Image Credit : X/@AKentsOfficial

నారీ నారీ నడుమ మురారి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

సినిమాకి విశాల్‌ చంద్ర శేఖర్‌ సంగీతం బాగా కుదిరింది. పాటలు అలరించేలా ఉన్నాయి. బిజీఎం సైతం బాగుంది. కూల్‌ అండ్‌ క్లాసీగా ఉంది. జ్ఞానశేఖర్‌ వీఎస్‌, యువరాజ్‌ కెమెరా వర్క్ అదిరిపోయింది. విజువల్స్ పెయింటింగ్‌లా ఉన్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నందు సావిరిగణ డైలాగ్స్ సినిమాకి పెద్ద అసెట్‌. అదరగొట్టాడు. డైలాగ్‌ ల్లోని సందేశం బాగుంది. భాను బోగవరపు కథ కూడా డిఫరెంట్‌గా ఉంది. దర్శకుడు రామ్‌ అబ్బరాజు సినిమాని బాగా తెరకెక్కించాడు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే విషయంలో మ్యాజిక్‌ చేశాడు. నవ్వించడంలో సక్సెస్‌ అయ్యాడు. చాలా చోట్ల రిపీట్‌ సీన్లు వేసినా, రొటీన్‌ సీన్లు పడ్డా, నవ్వించే విషయంలో సక్సెస్‌ అయ్యాడు. అదే ఈ సినిమా సక్సెస్‌ కి కారణంగా చెప్పొచ్చు. ఈ సంక్రాంతి పోరులో ఇది కూడా విజేతగా నిలిచే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

77
ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌
Image Credit : X/@AKentsOfficial

ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌

 `నారీ నారీ నడుమ మురారి` సంక్రాంతికి పండక్కి అదిరిపోయే క్లైమాక్స్ పడింది. హ్యాపీ ఎండింగ్‌లా, ఈ సంక్రాంతి విన్నర్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌, జెంజీ ఇలా అన్ని ఏజ్‌ గ్రూప్‌ ఆడియెన్స్ కలిసి చూసే మూవీ అవుతుంది.

రేటింగ్‌ 3.25

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?
Recommended image2
నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
BMW Movie Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవితేజ ఈ సారైనా హిట్ కొట్టాడా?
Related Stories
Recommended image1
'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?
Recommended image2
BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved