సమంత కూడా వెబ్ సిరీస్ చేసింది. పాపులర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మేన్ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్ సిరీస్ లో సమంతది నెగటివ్ టచ్ ఉన్న రోల్.
స్టార్ హీరోయిన్లు సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. రకుల్, రాశీ, తమన్నా ఇలా అందరు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. సమంత కూడా వెబ్ సిరీస్ చేసింది. పాపులర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మేన్ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్ సిరీస్ లో సమంతది నెగటివ్ టచ్ ఉన్న రోల్. ఇందులో సమంత పాత్ర కొత్త కోణంలో సాగుతుందట. గతంలో ఎన్నడూ చూడని యాంగిల్‌లో సమంత చూస్తారని చెబుతోంది సమంత.
బాలీవుడ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందించారు. ఇప్పటికే మొదటి భాగం మంచి ఆదరణ పొందగా, త్వరలో రెండో భాగం విడుదల కాబోతుంది. అయితే దీన్ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం కానుందట. ఈ విషయాన్ని సమంత వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ వెబ్ సిరీస్ ఫోటోని పంచుకుంది. ఇది అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుంది.
సమంత ప్రస్తుతం `సామ్‌జామ్` టాక్ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా విజయ్ దేవరకొండ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఇందులో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా బన్నీఎపిసోడ్ ప్రసారం కానుంది. మరోవైపు రోజుకో సెక్సీ ఫోటోతో అభిమానులను అలరిస్తుంది సమంత.
