రెండు సార్లు వాయిదా పడ్డ శాకుంతలం మరో కొత్త డేట్ తో వచ్చింది. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని టీమ్ నిర్ణయించారు.  

ప్రతి సన్నివేశం విజువల్స్ లో రూపొందిస్తున్నారు. గ్రాఫిక్ వర్క్ కి అధిక సమయం పడుతుంది. షూటింగ్ కంప్లీటై ఏడాది అవుతున్నా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. రెండు దఫాలు విడుదల తేదీ ప్రకటించి క్యాన్సిల్ చేశారు. మొదట 2022 నవంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అది కుదరలేదు. వాయిదా ప్రకటన చేశారు. ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు సెకండ్ టైం ప్రకటించారు. మళ్ళీ వాయిదా వేసినట్లు చెప్పి ప్రేక్షకులను నిరాశ పరిచారు. 

తాజాగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. యూనిట్ సమ్మర్ పై కన్నేయగా... ఈసారైనా చెప్పిన సమయానికి విడుదల చేస్తారా? లేక వాయిదా వేస్తారా? అని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పలుమార్లు విడుదల తేదీ మార్చిన నేపథ్యంలో ఈ నెగటివ్ కామెంట్స్ తెరపైకి వస్తున్నాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…

టైటిల్ రోల్ సమంత చేస్తుండగా ఆమె ప్రియుడు దుష్యంతుడుగా మలయాళ నటుడు మోహన్ దేవ్ చేస్తున్నారు. కీలకమైన దుర్వాస మహర్షి పాత్రను మోహన్ బాబు చేయడం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ శాకుంతలం మూవీతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమె శకుంతల కుమారుడు భరతుడు పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే అర్హ లుక్ బయటకు రాగా ప్రసంసలు దక్కుతున్నాయి.