Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని హీరోలకు దారి చూపిన సమంత!

అక్కినేని హీరోలైన నాగార్జున, చైతన్యలు కూడా ఓటిటి వైపు అడుగులు వేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని వినికిడి. ఇప్పటికే నాగ్ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో పాటు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగ్ కనిపించనున్నారట.

samantha stands role model for akkineni heroes for digital entry ksr
Author
Hyderabad, First Published Jun 19, 2021, 10:22 AM IST

గోల్డెన్ లెగ్ సమంత అడుగు ఎక్కడ పెడితే అక్కడ కనకవర్షమే. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విజయం ద్వారా మరోమారు ఆ విషయాన్ని నిరూపించింది సమంత. ఆమె డెబ్యూ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 సూపర్ సక్సెస్ వ్యూస్ తో దూసుకుపోతుంది. వివాదాల సంగతి పక్కన పెడితే సమంత యాక్టింగ్ కి వంద మార్కులు పడ్డాయి. పాత్ర ఏదైనా తాను హైట్స్ చూపించగలదని నిరూపించింది. 


ది ఫ్యామిలీ మాన్ 2 సక్సెస్ నేపథ్యంలో సమంతకు మరిన్ని ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. కాగా అక్కినేని హీరోలైన నాగార్జున, చైతన్యలు కూడా ఓటిటి వైపు అడుగులు వేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని వినికిడి. ఇప్పటికే నాగ్ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో పాటు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగ్ కనిపించనున్నారట. ఇది మూవీనా లేక సిరీసా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చనేది టాలీవడ్ టాక్. 


హీరో నాగ చైతన్య గతంలో ఓటిటి కి సిద్ధం అని చెప్పారు. సమంత సక్సెస్ చూశాక ఆయన మరింత ఆసక్తి చూపిస్తున్నారట. ఈ మేరకు ఎవరైనా మంచి సబ్జెక్టుతో ముందుకు వస్తే డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని రెడీగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ మొత్తం ఓటిటిదే అని అవగతం అవుతుండగా అక్కినేని హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. 


నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అలాగే బంగార్రాజు అనే మరో మూవీకి ఓకె చెప్పారు. ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ మూవీ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios