Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసిన సమంత... అంతకంతకూ పెరుగుతున్న రేంజ్!

నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న సమంత ఏకంగా హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్లు వస్తున్నాయి. సమంత మరో అరుదైన ఘనత సాధించారని అంటున్నారు. 
 

samantha signs a hollywood called chennai story ksr
Author
First Published May 27, 2023, 10:14 AM IST

సమంత ఫేమ్ అంతకంతకు పెరుగుతుంది. ఆమె పాపులారిటీ సౌత్ నుండి నార్త్ కి పాకింది. లేటెస్ట్ న్యూస్ ఏటంటే ఏకంగా హాలీవుడ్ మూవీకి సైన్ చేసిందట. చెన్నై స్టోరీ టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ తెరకెక్కుతుండగా హీరోయిన్ గా సమంతను ఎంచుకున్నారట. ఇది విదేశీ యువకుడు చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ అట. హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడట. ఫిలిప్ జాన్ చిత్ర దర్శకుడు కాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది.

ప్రస్తుతం సమంత ఖుషి, సిటాడెల్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి షూట్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కి ఖుషి సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల నేపథ్యంలో ప్రొమోషన్స్ షురూ చేశారు. సాంగ్స్ విడుదల చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. 

అలాగే సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ చేశారు. సహ నటుడు వరుణ్ ధావన్, సమంత మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించారు. 

కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం దారుణ పరాజయం చవి చూసింది. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా శాకుంతలం రికార్డులకు ఎక్కింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఏ మాత్రం నిర్మాణ విలువలు లేని శాకుంతలం సీరియల్ ని తలపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios