వరస సినిమాలతో సమంత పూర్తి బిజీగా ఉంది. అటు తెలుగు అటు తమిళంలో ఇంట్రెస్టింగ్ పెద్ద ప్రాజెక్టు అంటే సమంత ఉండాల్సిందే. అంత బిజీలోనూ గ్యాప్ దొరికినప్పుడల్లా  భర్త  నాగ చైతన్యతో కలిసి ఫారెన్ వెకేషన్ కు జంప్ అయ్యిపోతోంది. అయితే ఆమెలో గొప్పతనం ఏమిటీ ...మిగతా వాళ్లకు ఆమెకూ తేడా ఏమిటీ అంటే ...ఎంత బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలు చేయటం ఆపదు..అలాగే   తను నటించే సినిమాలనే కాకుండా ఇతర సినిమాలను కూడా చూస్తూ ఉంటుంది.  

అక్కడితో ఆగకుండా తనకు నచ్చితే వాటిని ప్రశంసించడం, తను ఆ పాత్ర చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేసుకోవటం  మర్చిపోదు. తాజాగా ఉయరే టైటిల్ తో వచ్చిన మలయాళం సినిమాను చూసిన సామ్ ఆ టీమ్ ను ట్విట్టర్ ద్వారా మెచ్చుకుంది. అంతేకాదు ఆ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందిట. రైట్స్ కోసం ఎంక్వైరీ చేస్తోందని వినికిడి. ఆ సినిమాలో యాసిడ్ దాడి  బాధితురాలి పాత్రలో కనిపించటానికి సమంత సిద్దంగ ఉందని చెప్తున్నారు. ఓ ప్రేరణ ఇచ్చే పాత్రలో కనిపించాలని ఆమె ఉత్సాహపడుతోందిట. నిర్మాత ఎవరూ దొరకక పోతే తన సొంత బ్యానర్ పై ఈ సినిమా చెయ్యాలనుకుంటోందిట. 

 ఉయరే  సినిమాలో పైలట్ కావాలనే ధ్యేయం ఉన్న అమ్మాయి పాత్రలో పార్వతి నటించింది. తనకు పైలట్ ట్రైనింగ్ సెంటర్ లో అడ్మిషన్ వచ్చిన తర్వాత ముంబై కి వెళ్ళడానికి రెడీ అవుతుంది.  ఆ సమయంలోనే విపరీతంగా ప్రవర్తించే పొసెసివ్ మనస్తత్వం కల తన ప్రియుడికి బ్రేకప్ చెప్తుంది. కానీ అతను యాసిడ్ దాడి చేస్తాడు.  ఈ సంఘటన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ 'ఉయరే' లో మిగతా కథ.