టాలీవుడ్ స్టార్ లేడీ సమంత అక్కినేని శాకుంతలం మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే శాకుంతలం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో శాకుంతలం షూటింగ్ జరుగుతుందని సమాచారం. దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్.. నిర్మాత దిల్ రాజుతో కలిసి ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. 


జాను సినిమా తరువాత గ్యాప్  తీసుకున్న సమంత శాకుంతలం మూవీకి సైన్ చేయడం విశేషం.  ఇక శాకుంతలం మూవీలో సమంతకు జంటగా మలయాళ యువ హీరో మోహన్ దేవ్ ని ఎంపిక చేశారు. శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా సండే కావడంతో సమంత రెస్ట్ తీసుకుంటున్నారట. సండే డే.. రెస్ట్ డే, స్నాగుల్ డే, హ్యాపీ డే అంటూ క్యాప్షన్ పెట్టిన సమంత.. సోఫాలో కూర్చొని, తన పెట్ డాగ్ తో కునుకు తీస్తున్నారు. సమంత పంచుకున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


సమంత తన పెట్ డాగ్ హ్యాష్ ని ఎంతగానో ప్రేమిస్తారో. ఒక విధంగా దానికి తాను తల్లిని అంటూ చెప్పుకుంటారు. ఆమధ్య చెప్పిన మాట వినకపోతే హ్యాష్ విషయంలో నేను యాంగ్రీ మదర్ అయిపోతా... అంటూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టింది సమంత. మరోవైపు పెళ్లి చేసుకొని మూడున్నరేళ్లు అవుతున్నా ఇంకా సామ్, చైతన్య పేరెంట్స్ కాలేదు. సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కఫుల్ ఎప్పుడు పిల్లల్ని కంటారో చూడాలి.